క్యాన్సర్ దూరం చేసే 19 ఆహార పదార్థాలు ఏంటో తెలుసా?

BY T20,

సేంద్రియ మార్కెట్ లేదా సూపర్ మార్కెట్లలో లభించే అనేక రకాల ఆహార పదార్థాలు క్యాన్సర్ నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. సహజంగానే వీటిలో సహజంగానే క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే లక్షణాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ని ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్ ని తటస్థీకరిస్తాయి. అంతే కాదండోయ్ ఇవి క్యాన్సర్ తో పోరాడే ఫైటోకెమికల్స్ గా కూడా మారుతాయి.మన శరీరంలో మిలియన్ల కొద్దీ క్యాన్సర్ కణాలు పెరిగినప్పుడు మన రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంటుంది. అయితే క్యాన్సర్ కణాలను ఓ వైపు నిరోధిస్తూనే మరో వైపు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడే ఆ పందొమ్మిది రకాల ఆహార పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు.. బ్రకోలి స్పినాచ్ కాలే క్యాబేజీ వంటివి క్యాన్సర్ ని తరిమికొట్టే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. రెండోది యాపిల్. యాపిల్ లో ఉండే విటమిన్ ఏ సీ పీచు పదార్థం ఫైటోన్యూట్రియంట్ కాటెచిన్ సైనైడ్ రూటిన్ లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మూడవది చిల్లీ పెప్పర్. ఇందులో ఉండే విటామిన్ సీ పీచు పదార్థాలు క్యాన్సర్ ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

బాదం గుడ్లు తృణ ధాన్యాలు గింజలు మరియు విత్తనాలు పచ్చి బఠాణి ల్లో ఉండే జింక్ పీచు పదార్థం మంచి కొవ్వు విటమిన్ ఇ సీ మినరల్స్ శరీరానికి ఎంతో మంచివి. అలాగే వెల్లుల్లి చిలగడ దుంప బీట్ రూట్ సోయాబీన్ స్ట్రాబెర్రీలు మరియు రాస్ బెర్రీస్ పసుపు టొమాటోలు అవిసె గింజలు ద్రాక్ష మరియు ద్రాక్ష రసం కొవ్వు చేపలు ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

క్యాన్సర్ రోగులే కాకుండా మామూలు వ్యక్తులు కూడా ప్రతిరోజూ ఆహారంలో ఈ పదార్థాలను చేర్చుకోవడం చాలా మంచిది. అందుకే ఆరోగ్య నిపుణలంతా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ 19 రకాల ఆహార పదార్థాలను తినమని సూచిస్తారు. గర్భిణీలు ఇతర సమస్యలు ఉన్న వాళ్లు కూడా ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి అన్ని సమస్యలను అధిగమించవచ్చని చెబుతున్నారు. అందుకే మీరు కూడా ఈ పదార్థాలను వీలయినంత ఎక్కువగా తిని ఆరోగ్యంగా ఉండండి.

Scroll to Top