3 Dictators : మృత్యువుతో పోరాడుతున్న ప్రపంచంలోని ముగ్గురు నియంతలు..!!

BY T20,

3 Dictators : ఒకరిది ప్రపంచాన్ని ఏలాలన్న అత్యాశ.. మరొకరిది తన పంతం నెరవేరడం కోసం రక్తాన్ని ఏరులై పారించేంత హిట్లరిజం.. ఇంకొకరిది అగ్రరాజ్యాలను వణికించాలన్న యుద్ధదాహం.

ఈ ముగ్గురు 21వ శతాబ్దపు నియంతలు. నిరంకుశత్వంలో హిట్లర్‌ను మించినవాళ్లు ! మూర్ఖత్వంలో ముస్సోలినీ కంటే దారుణమైన వాళ్లు. దేశాలు వేరైనా ఈ ముగ్గురి పద్ధతులు ఒక్కటే ! అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలన్న ఆరాటం… ప్రపంచాన్ని శాసించాలన్న అత్యాశ.. ఈ ముగ్గురికీ ఉన్నాయి. అలాంటి ముగ్గురు నియంతలు ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నారు.

వారు ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతలు..నియంతకే కొత్త అర్థాన్ని చెప్పిన వాళ్లు..అధికారం కోసం ఎంతకైనా తెగించే క్రూరులు..నిలువెల్లా యుద్ధ దాహాన్ని నింపుకున్న అధినేతలు..రక్తాన్ని ఏరులై పారించే ఈ శతాబ్దపు డిక్టేటర్లు..చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా చీఫ్‌ కిమ్‌ జోంగ్ ఉన్ గురించి ఇంతకన్నా ఏం చెప్పగలం. ఈ ముగ్గురు ఒకరిని మించిన వాళ్లు మరొకరు. నియంత అనే పదానికి సరిగ్గా న్యాయం చేసేవాళ్లు. నిలువెల్లా యుద్ధ దాహం నిండినవాళ్లు. దేశాలు వేరైనా, భాషలు వేరైనా, స్వభావాలు వేరైనా ఈ ముగ్గురు అధినేతలకు కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా దేశాలకు అధినేతలుగా ఉన్న వీళ్లు… చచ్చే వరకు అధికారం తమ చేతుల్లోనే ఉంచుకునేందుకు ఎన్నో దారుణాలకు ఒడిగట్టారు.

చట్టాలను మార్చి కొత్తగా శాసనాలు చేసి మరీ ప్రత్యేకంగా తమకోసం ఓ రాజ్యాంగాన్నే రాసుకున్నారు. అంతేకాదు ప్రపంచాన్ని శాసించాలన్నది ఈ ముగ్గురి ఆశ. అగ్రరాజ్యం అనే హోదా నుంచి అమెరికాను పక్కకు నెట్టి ఆ స్థానంలో తాము కూర్చోవాలన్నది… ప్రపంచాన్ని శాసించాలన్నది వీరి అత్యాశ. దానికోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు జిన్‌పింగ్‌ ఇరుగుపొరుగు దేశాల్లో కుట్రలకు తెరలేపుతూ.. బయో వెపన్‌లతో వినాశనం సృష్టిస్తున్నాడు. అటు పుతిన్ ఏకంగా యుక్రెయిన్‌లో రక్తాన్ని ఏరులై పారిస్తున్నాడు. ఇక జిన్‌పింగ్‌ ప్రమాదకర అణ్వాయుధాలను ప్రయోగిస్తూ.. అగ్రరాజ్యాలకే హెచ్చరికలు పంపుతున్నాడు. అయితే సడన్‌గా ఈ ముగ్గురు నియంతలకు ఒకేసారి అనుకోని షాక్‌ తగిలింది. వింత వ్యాధులు ఒకేసారి దాడి చేశాయి. దీంతో ముగ్గురూ అనారోగ్యం పాలయ్యారు.

అధికారం, డబ్బు, జీవితం ఏదీ శాశ్వతం కాదు. కన్నుతెరిస్తే జననం కన్నుమూస్తే మరణం… రెప్పపాటే ఈ జీవితం. ఈ సత్యాన్ని తెలుసుకోలేక విర్రవీగే నియంతలకు కాలం గుణపాఠం చెబుతుంది. ఇప్పుడు జిన్‌పింగ్‌, పుతిన్, కిమ్‌ జోంగ్ ఉన్‌ విషయంలో అదే జరిగేటట్లు కనిపిస్తోంది. తమను ఎదురించి ప్రతి ఒక్కరిని ఉక్కుపాదంతో అణిచివేశారు. కానీ ఇప్పుడు ప్రకృతి ఎదురు తిరిగింది. ఇప్పుడేం చేయగలరు. ఇంతకాలం వెనకేసుకున్న డబ్బు, చేతిలో ఉన్న అధికారం అనారోగ్యాన్ని సరిచేయలేవు. సాధారణ ప్రజలు, ప్రపంచ దేశాలను అదుపు చేయలేని ఆ ముగ్గురిని ఓ రోగం మూలన పడేసింది. మృత్యువుకే వణుకు పుట్టించిన ఈ ముగ్గురు నియంతలు ఇప్పుడు అదే మృత్యువుతో తీవ్రంగా పోరాడుతున్నారు. వారిని నిరాశ, నిస్పృహలు పూర్తిగా ఆవహించాయి. ఇంతకాలం అధికారం కోసం చేసిన దారుణాలన్నీ ఇప్పుడు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఎప్పుడు ఏ క్షణాన మృత్యువు కబళిస్తుందో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. బిలియన్ల కొద్దీ డాలర్లు, అత్యాధునిక వైద్యం, దేశాన్ని శాసించే అధికారం ఇవేవీ… ఆ రోగాలను నయం చేయలేకపోతున్నాయి. ఏదీ శాశ్వతం కాదన్న విషయం ఇప్పటికైనా ఈ ముగ్గురికి అర్థమవుతోందో.. లేదో…!

కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు ఇవన్నీ కలిపితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఇతను చేయని దారుణాలంటూ ఏవీ లేవు. 21వ శతాబ్దంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన విస్తరణవాద ధోరణితో మరోసారి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టాడు. నియంతృత్వం, విస్తరణవాదంలో హిట్లర్‌కు జిన్ పింగ్ ఏమాత్రం తీసిపోడు. సొంత పార్టీలో తన ఎదుగుదలకు అడ్డుగా ఉన్న వాళ్లు, బయటి నుంచి ప్రశ్నించేవాళ్లు, వ్యతిరేక తీర్పులిచ్చే న్యాయమూర్తులు.. తన అధికారాన్ని ధిక్కరించే వ్యాపారవేత్తలు.. ఇలా తనకు అడ్డొచ్చిన వారిని జైలుకో లేదంటే పైకో పంపించేశాడు. చట్టాలు మార్చి ప్రజాస్వామ్యంతో ఎలాంటి సంబంధం లేకుండా చైనాకు శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. చివరకు ఇంత చేసి ఏం సాధించాడు..! సెరిబ్రల్ అణురిజం అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి ముదిరి రేపోమాపో పోయినప్పుడు తనతో ఏదీ తీసుకెళ్లలేడు.. కనీసం ప్రజల్లో మంచి గుర్తింపు అయినా ఉందా అంటే అదీ లేదు. ఇప్పుడు అతని నిరంకుశత్వానికి భయపడి అక్కడి ప్రజలు నోరు మెదపట్లేదు కానీ..! అతనిపై ప్రేమతో కాదు.

ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్.. సోవియట్‌ సామ్రాజ్యాన్ని తిరిగి సృష్టించడమే అతని లక్ష్యం. దానికి అడ్డొచ్చే దేశాలపై యుద్ధానికి దిగడమే అతని పని ! యుక్రెయిన్‌లో సృష్టించిన రక్తపాతమే దానికి నిదర్శనం.

ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలనే ఆశ బలంగా అతని మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ కలలో భాగంగానే ఇంతకు ముందు సోవియట్‌ యూనియన్‌ ఉన్న దేశాలను తమ చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు పుతిన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాదు కూడదన్న దేశాలపై ఇలా యుద్ధానికి దిగుతున్నాడు. జిన్‌పింగ్‌తో పోలిస్తే పుతిన్‌ కూడా తక్కువేమీ తినలేదు.అధికారాన్ని సొంతం చేసుకునేందుకు అడ్డదారులు ఎన్నో తొక్కాడు. శాశ్వత అధ్యక్షుడిగా ఉండడం కోసం రాజ్యాంగాన్నే మార్చి పారేశాడు. తన సహచర మంత్రులపై సందేహాలతో విషప్రయోగం చేసి చంపించేశాడు. అవినీతి సొమ్ముతో విదేశాల్లో భారీగానే ఆస్తులు కూడగట్టాడు. ఇప్పుడేమైంది… బ్లడ్‌ క్యాన్సర్‌ బారిన పడ్డాడు.

ఇక ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. అతను నియంతలకే నియంత. శాడిజానికి కేరాఫ్‌ అడ్రస్‌.. నియంతృత్వానికి నిజమైన రూపం.. కిమ్‌.

అతను నరకానికి నకలు చూపిస్తాడు.. అతను చేసే చేష్టలు.. వ్యవహరించే తీరు.. యమ కింకరులకి నాయకుడన్నట్టుగా ఉంటుంది. నరకాధిపతి కూడా తప్పు చేస్తేనే శిక్ష వేస్తాడు.. కానీ నార్త్‌కొరియా అధ్యక్షుడు కిమ్‌ మాత్రం చెప్పినట్టు వినకుంటే నరకానికి స్పెల్లింగ్‌ రాయిస్తాడు. తాను అనుకున్నది జరగకుంటే ఖైదు చేస్తాడు.. కోపమొస్తే చంపేస్తాడు. తన కోసం ప్రజలు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని శాసిస్తాడు. బట్టలపైనా నిషేధం, ఆహారంపైనా ఆంక్షలు.. ఒకటేమిటి తనకు నచ్చనివన్నీ రద్దు చేసుకుంటూ పోతాడు. సొంత కుటుంబ సభ్యులనే వేట కుక్కలతో చంపించిన క్రూరత్వం కిమ్‌ది !

అంతేకాదు ఇతనికి కూడా ప్రపంచాన్ని ఏలాలన్న కోరిక ఉంది. అందుకే… అణ్వాయుధ పరీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు అమెరికాపై కాలు దువ్వుతుంటాడు. అలాంటి కిమ్‌ ఇప్పుడు తీవ్ర అనారోగ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉత్తర కొరియా నుంచి ఏ విషయం బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో… అతని వచ్చిన రోగమేంటి ? ఇప్పుడు ఎలా ఉన్నాడన్నది తెలియడం లేదు. ఇలా ముగ్గురు నియంతలు ఒకేసారి వ్యాధుల బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు.

ముగ్గురు నియంతల పరిస్థితి ఇదీ..

జిన్‌పింగ్‌కు సెరిబ్రల్‌ అణురిజం, పుతిన్‌కు బ్లడ్‌ క్యాన్సర్‌, కిమ్‌కు వచ్చిన జబ్బేంటో కూడా బయటకు తెలియదు… ఇదీ నియంతల పరిస్థితి. అనారోగ్యంతో అంతా మంచమెక్కేశారు. ముగ్గురూ రోజులు లెక్క బెడుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. త్వరలోనే ఆయా దేశాలకు కొత్త అధ్యక్షుల్ని ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జోరందుకుంది.జిన్‌పింగ్‌ నియంతే కావొచ్చు. అతనొక మూర్ఖడే అయి ఉండొచ్చు. కానీ అతని హయాంలో చైనా ఊహించని అభివృద్ధి సాధించింది. అయినా అతనిపట్ల అక్కడి ప్రజలకు కూడ సదాభిప్రాయం లేదు. జిన్ పింగ్‌ ప్రపంచ దేశాలకు ఎలా విలన్‌గా మారాడో… చైనా ప్రజలకు కూడా అలానే విలన్‌గా మారాడు. ఇప్పుడు వింత వ్యాధితో మంచాన పడ్డాడు. జిన్‌పింగ్‌ సెరిబ్రల్ అణురిజం అనే వింత వ్యాధితో బాధ పడుతున్నాడు. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. ఇదేదో ఇప్పుడు కొత్తగా అటాక్‌ అవ్వలేదు. మూడేళ్ల క్రితం ఈ వ్యాధి జిన్‌పింగ్‌కు సోకింది. ఇప్పుడది ముదిరి పాకాన పడింది. లాస్ట్‌ ఇయర్ ఇదే వ్యాధి బాగా ఇబ్బంది పెట్టడంతో జిన్‌పింగ్‌ ఆసుపత్రిలో చేరాడు. తర్వాత మళ్లీ కోలుకున్నాడు. కానీ ఇప్పుడు అదే వ్యాధి పూర్తిగా ముదరడంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. వ్యాధి ముదరడంతో ఇప్పుడు చికిత్స అందించడం కూడా కష్టంగా మారింది. సెరిబ్రల్ అణురిజం వ్యాధితో మెదడులో రక్తం గడ్డ కట్టేస్తుంది. దీని కారణంగా మెదడులోని రక్త నాలాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. అదే జరిగితే మెదడులో రక్తస్రావం జరిగి మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అదీ కాకపోతే బ్రెయిన్ స్ట్రోక్‌ వస్తుంది. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తే ఇక పైకి టికెట్‌ తీసుకోవడమే ! ఇదే వ్యాధి కారణంగా గతేడాది పలు విదేశీ పర్యటనల్లో జిన్‌పింగ్‌ చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ వ్యాధితో ఇంత వరకు ఆరోగ్యంగా ఉండడమే గ్రేట్‌. ఇంతకాలం జిన్‌పింగ్‌ ఎలాగోలా నెట్టుకొచ్చాడు. కానీ ఇకపై అది కష్టం కావొచ్చు. మరో పది పదిహేనేళ్లు చైనాను తన గుప్పిట్లోనే ఉంచుకోవాలనుకున్న జిన్‌పింగ్‌.. త్వరలోనే అధికారాన్ని వదులుకోవచ్చన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది.

పుతిన్ కు బ్లడ్‌ క్యాన్సర్‌..

రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వాస్తవానికి యుక్రెయిన్‌పై యుద్ధానికి ముందు నుంచే పుతిన్ ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు శస్త్రచికిత్స జరిగింది. అయినా పూర్తి స్థాయిలో అతను ప్రమాదం నుంచి బయట పడలేదు. పుతిన్ 2016 నుంచి థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, దానికి చికిత్స చేయించుకునేందుకే కొన్నిసార్లు అజ్ఞాతంలోకి కూడా వెళ్లారని అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. 2016 నుంచి 2019 వరకు థైరాయిడ్ క్యాన్సర్‌ సర్జన్‌తో పాటు చాలామంది వైద్యులు నగరంలోని పుతిన్ నివాసానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కచ్చితంగా ఆయన అనారోగ్య సమస్య ఏమిటనేది పక్కాగా తెలియకపోయినా… అది నయమయ్యేది మాత్రం కాదని తెలుస్తోంది. రష్యా నుంచి, ఇతర చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం పుతిన్‌ చాలా తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. అయితే రష్యాలో ఉన్న కఠిన చట్టాల కారణంగా అసలు నిజాలు వెలుగు చూడడం లేదు. అందులోనూ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇలాంటి విషయాలు బయటకొస్తే అది రష్యాకే నష్టాన్ని చేకూరుస్తుంది. అందుకే ఈ విషయంపై గోప్యత పాటిస్తున్నారు.

జబ్బు పడినా..ఆ విషయాన్ని ప్రకటించే పరిస్థితే లేదు..

ఇక ఫైనల్‌గా ఉత్తర కొరియా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. అతను కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇప్పటికే నార్త్‌ కొరియాను సంక్షోభాలు చుట్టుముట్టాయి. అందులోనూ ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు కూడా మంచాన పడినట్లు తెలుస్తోంది. నిజానికి కిమ్‌ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉంటుంది. అతని స్థూలకాయం బట్టి చూస్తే అతడిని రోగాలు చుట్టుముట్టడం పెద్ద వింతగా అనిపించకపోవచ్చు. అయితే ఆ మధ్య ఒక్కసారిగా సన్నబడి కిమ్‌ అందరినీ ఆశ్చర్య పరిచాడు. అప్పటి నుంచి మరింత యాక్టివ్‌గా కనిపించాడు. కానీ అంతలోనే మళ్లీ అతను అనారోగ్యం బారిన పడినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఉత్తర కొరియా ఇనుప చట్రంలో చిక్కుకున్న దేశం కావడంతో అక్కడి నుంచి ఎలాంటి వార్తలు బయటకు రావు. అక్కడ ఇంటర్నెట్‌ వాడకం నిషేధం, ఫోన్ వాడకం పైనా నియంత్రణలు కొనసాగుతున్నాయి. దీంతో కిమ్‌ అనారోగ్యానికి సంబంధించి న్యూస్ బయటకు రావడం లేదు. అయితే ఆ మధ్య ఇలానే కిమ్‌ మాయం కావడంతో.. అతను చనిపోయాడని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చాడు. ఇప్పుడు కూడా అలాంటి న్యూసే స్ప్రెడ్‌ అవుతోందా ? లేదంటే నిజంగానే కిమ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా అనేది తెలియాల్సుంది !అధికారం కోసం పాకులాడి విధ్వంసాలు సృష్టించి ఎందరినో బలితీసుకున్న ఈ ముగ్గురు.. నియంత అన్న పేరు తప్ప సాధించిందేమీ లేదు. అనారోగ్యంతో ఒకవేళ చనిపోయినా.. చరిత్రలో నియంతలుగానే మిగిలిపోతారు.

Scroll to Top