కొరటాల మొదటి వైఫల్యానికి మెగా జోక్యమే కారణమా?

BY T20,

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు.. ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు..

ఈయన సామజిక అంశాలను ప్రధానంగా తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కిస్తూ ఉంటాడు.. ఈయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని తెరమీదకు తెస్తూ ఉంటాడు..

ఇక ఇప్పుడు మెగా హీరోలతో సినిమా చేసాడు. ప్రెసెంట్ చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమా చేసాడు.. ఈ సినిమా ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు..రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. వీరిద్దరూ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది..

అయితే భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయినా ఈ సినిమాతో కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ కొడతాసు అని అంతా అనుకున్నారు. కొరటాల నుండి దాదాపు 4 ఏళ్ల తరవాత ఈ సినిమా వచ్చింది.. ఈయన ప్రతి సినిమాతో హీరోలను మాత్రమే కాదు సినీ ప్రేక్షకులను సైతం మెప్పించాడు.. అయితే ఇప్పుడు ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు సైతం ఇదే చెప్పాయి.. కొరటాల డైరెక్షన్ ఇలా ఉంటుంది అని ఎవ్వరు అనుకోలేదు.. స్క్రిప్ట్ కంటే కూడా మెగా హీరోలపైనే ద్రుష్టి పెట్టి సినిమాను వీక్ చేసారు అని కూడా కామెంట్స్ వినిపించాయి.. అయితే ఆచార్య సినిమా చూసిన తర్వాత ఇది కొరటాల సినిమానేనా అతడే డైరెక్ట్ చేశాడా లేదంటే మెగా హీరోల ప్రభావం ఏమైనా ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. 15 నిముషాల స్పెషల్ పాత్రను కొణిదెల సురేఖ కోరిక మేరకు 45 నిముషాలు చేసి ఆ పాత్రను పొడిగించారట కొరటాల.. అందువల్ల సినిమా నిడివి కూడా పెరిగి పోయిందని రన్ టైం ను తగ్గించడానికి కాజల్ పాత్రను పూర్తిగా తొలగించారని దీన్త కొరటాల అనుకున్న కథ అంతా మారిపోయిందని అనుకుంటున్నారు.. మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ మెగా జోక్యం వల్లనే ఈ సినిమా అయితే ప్లాప్ అయ్యింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Scroll to Top