ఆర్తి అగర్వాల్ మరణానికి అసలు కారణం ఏమిటో తెలుసా ?

BY T20,

ఫిలిం ఇండస్ట్రీ లో కొంత మంది నటీనటులు తమ వ్యక్తిగత కారణాలతో ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే, మహానటి సావిత్రి కాలంలో హీరోయిన్లు బొద్దుగా ఉన్నా ఆదరించేవారు, కారణాలు ఏమైనప్పటికి ఒళ్ళు తగ్గితేనే అవకాశాలు వస్తాయనే భయం ఆ రోజుల్లో హీరోయిన్లకు ఉండేది కాదు, ఒక హీరోయిన్ జీరో సైజు బాడీతో ఉంటేనే ప్రేక్షకులు చూస్తారా, ఆదరిస్తారా అన్న ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం ఉండదు, నిజంగా ఒక మంచి కధ, మంచి పాత్ర ఉంటె ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ఆత్మ విశ్వాసంతో చెప్పవచ్చు కానీ అనుకోకుండా కొంత లావెక్కి అవకాశాలు సన్నగిల్లి జీరో సైజు బాడీ కోసం చేసిన రకరకాల ప్రయత్నాల్లో ప్రాణాలు సైతం కోల్పోయిన హీరోయిన్లు ఉన్నారు.

అవకాశాల మాట పక్కన పెడితే ఏకంగా ప్రాణాలు కోల్పోవడం భాధాకరం. అలాంటి వారిలో ఆర్తి అగర్వాల్ ఒకరు.

పాగల్ పన్ అనే హిందీ చిత్రం ద్వారా నటిగా చిత్ర సీమకు పరిచయం ఐన ఆర్తి అగర్వాల్, ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. నిజానికి కొంచెం బొద్దుగా ఉండే ఆర్తి అగర్వాల్, అతి తక్కువ వ్యవధిలో తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవి తేజ లాంటి పెద్ద హీరోలతో సూపర్ హిట్ సినిమాలతో ఒక వెలుగు వెలిగింది. కానీ కొంత కాలం తర్వాత అవకాశాలు రావడం తగ్గిపోయాక తాను లావెక్కానని, హీరోయిన్ గా పూర్వ వైభవం పొందాలంటే తాను సన్న బడాలని అనుకుంది. జంక్షన్ లో జయమాలిని అనే సినిమా కోసం 89 కేజీలు ఉన్న ఆర్తి అగర్వాల్ 63 కేజీల బరువుకు వచ్చింది.  మరో 3 కేజీలు తగ్గే ప్రయత్నంలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకొని ప్రాణాలు మీదకు తెచ్చుకుంది. సర్జరీ వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ తలెత్తడంతో అట్లాంటిక్ సిటీ, న్యూ జెర్సీ లో తన గృహంలో జూన్ 6, 2015 లో మరణించింది. 31 వయసులో మరణించిన ఆర్తి అగర్వాల్, తన మరణం తో సినీ రంగంలోని వారినే కాకుండా ప్రేక్షకులను సైతం కంట తడి పెట్టించింది. ప్రవాస భారతీయుడైన గుజరాతీ యువకుడుని పెళ్లి చేసున్న ఆర్తి, వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న ఆర్తి నిజ జీవితంలో కూడా ఓటమిని చవిచూసింది. చివరికి ప్రాణాలను సైతం కోల్పోయింది.

Scroll to Top