`ఆచార్య` ట్రైలర్ టాక్ : రెండు బెబ్బుల స్వైర విహారం

BY T20,

మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా వచ్చి దాదాపు రెడున్నరేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా? అని మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న తాజా చిత్రం`ఆచార్య`పై భారీ అంచనాలున్నాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పడు విడుదలవుతుందా? అని మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తొలి సారి మెగాస్టార్ - చరణ్ కలిసి నటించిన తొలి చిత్రం కావడం.. ఇందులో తండ్రీ కొడుకుల పాత్రలు ఊహకందని విధంగా పవర్ గా సాగనుండటం.. చరణ్ పాత్ర 25 నిమిషాల మిడివితో మాత్రమే వుండటం ఈ చిత్రంపై అంచనాల్ని పెంచేసింది. రెబల్ నక్సలైట్ లీడర్ గా రామ్ చరణ్ నటించిన ఈ మూవీ భారీ క్రేజ్ తో పాటు బిజినెస్ పరంగానూ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. సినిమాలో చిరు చరణ్ ల పాత్రలు రెండు బెబ్బులులు ఒకేసారి ప్రత్యర్థులపై తిరగబడితే ఎలా వుంటుందో అంతకు మించిన రొమాంచిత అనుభూతికి ఈ సినిమా లోనే చేయబోతోందని ఇటీవల విడుదల చేసిన టీజర్ ఇప్పటికే స్పష్టం చేసింది.

మంగళవారం ఈ మూవీ ట్రైలర్ ని 153 థియేటర్లలో చిత్ర బృందం సాయంత్రం 5:49 నిమిషాలకు విడుదల చేశారు. థియేటర్లలో ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ పూనకాలతో మెగాస్టార్ పవర్ స్టార్ పోస్టర్లకు పాలభిషేకం చేస్తుండటం విశేషం. `ఆచార్య` ట్రైలర్ ని చెప్పినట్టుగానే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. రామ్ చరణ్ వాయిస్ లో ట్రైలర్ మొదలైంది. `దివ్య వనమొకవైపు... తీర్థ జలం ఒక వైపు... నడుమ ఆదఘట్టం.. అంటూ టెంపుల్ సిటీ ధర్మ స్థలిలో సీన్ ఓపెన్ చేశారు.

ఇక్కడ అందరూ సౌమ్యులు పూజలు పునస్కారాలు చేసుకుంటూ కష్టాలొచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కు బిక్కుమని వుంటామేమో నని పొరబడి వుండొచ్చు...ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది. ధర్మ స్థలి..అధర్మస్థలి ఎలా అవుతది? అంటూ చరణ్ చెబుతున్న డైలాగ్ లు.. ఆకట్టుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో వచ్చే విజువల్స్ కూడా అప్ టుద మార్క్ అనే రేంజ్ లో వున్నాయి. చిరు ఎంట్రీ... పాదఘట్టం వాళ్ల గుండెలమీద కాలేస్తే ఆ కాలు తీసెయ్యాలట. కాకపోతే అది ఏకాలా అని... నేను వచ్చానని చెప్పాలనుకున్నాను... కానీ చేయటం మొదలుపెడితే... అంటూ చిరు చెప్పే డైలాగ్స్.. యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా వున్నాయి.

ఇక ఇద్దరి నేపథ్యంలో చిత్రీకరించిన ఫారెస్ట్ ఫైట్ రాజమౌళి మార్కు ఫైట్ లా కనిపిస్తోంది. కామ్రేడ్ డ్రెస్సుల్లో వున్న చిరు చరణ్ ఓ కొంత మంది వ్యక్తులని అడవిలో వేటాడే తీరు... చరణ్ పరుగెత్తుకుంటూ వస్తే చిరు చేయి చాపడం.. ఆ చేయిపై చరణ్ కాలు మోపి గాల్లోకి ఎగిరి ప్రత్యర్థుల గుండెల్ని చిలుస్తున్న తీరు రెండు బెబ్బులులు అసుర సంహారం కోసం స్వైర విహారం చేసిన విధంగా వుంది.

గత రెండేళ్లుగా ఆకలితో వున్న ఫ్యాన్స్ కి చిరు చరణ్ ఒకే సారి `ఆచార్య`తో బిర్యానీ ని వడ్డించబోతున్నారా? అనే స్థాయిలో ట్రైలర్ వుంది. ఫ్యాన్స్ కి ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ ఓ మాస్ జాతరే అని చెప్పవచ్చు. విజువల్ గ్రాండీయర్ చరణ్ చిరులపై చిత్రీకరించిన పోరాట ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవడం కాయం.

ఇప్పటికే టీజర్ తో టీజ్ చేసిన `ఆచార్య` ట్రైలర్ తో ఏకంగా సినిమానే చూపించనంత పని చేశారు. దీంతో ఈ సినిమా వున్న అంచనాలు మరింత స్కై హైకి చేరుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద తండ్రికొడుకులు `ఆచార్య`తో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలతో పాటు ఫ్యాన్స్ ట్రైలర్ చూశాక ముక్త కంఠంతో చెబుతున్నారు.

Scroll to Top