కమల్ తరువాత ఆ విషయంలో ఎన్టీఆర్ పర్ ఫెక్ట్

BY T20,

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలకు సంబంధించిన సూపర్ స్టార్ లు ఎంతో మంది వున్నారు. వారి వారి స్థాయిలో స్టార్స్ గా తమ భాషల్లో తమదైన ముద్ర వేశారు. ఫ్యాన్స్ని ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అయితే అందులో చాలా తక్కువ మంది మాత్రమే సూపర్ స్టార్ లుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. అందులోనూ పర్ ఫెక్ట్ ఆర్టిస్ట్ లు మాత్రం కేవలం ఇద్దరే ఇద్దరున్నారట. ఒకరు లోకనాయకుడు కమల్ హాసన్. మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఈ విషయాన్ని తమిళ దర్శకుడు కన్మణి తాజాగా వెల్లడించడం ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది.   తెలుగులో నా ఊపిరి చిన్నోడు బీరువా వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కన్మణి ఇటీవల ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కన్మణి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. మన హీరోల్లో ఎవరు పర్ ఫెక్ట్ ఆర్టిస్ట్ అన్నది కుండ బద్దలు కొట్టినట్టు ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారు. 'నాకు వ్యక్తిగతంగా జూ. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి కమల్ హాసన్ తరువాత పర్ ఫెక్ట్ ఆర్టిస్ట్ ఎవరైనా ఈ జనరేషన్ లో వున్నారంటే అది ఖచ్చితంగా జూ. ఎన్టీఆరే అని చెబుతాను.

ఎందుకంటే ఎంత సూపర్ స్టార్ అయినా క్లోజప్ షాట్ పెట్టి ఎమోషనల్ సీన్ లలో ఏడ్వండి అని అంటే ఏ స్టార్ హీరో క్లోజప్ షాట్ లో ఏడ్వడానికి ఇష్టపడరు. కానీ కమల్ హాసన్ ఎన్టీఆర్ మాత్రం అలా కాదు. మిగతా హీరోలు క్లోజప్ షాట్స్ లో ఏడవడానికి ట్రై చేసినా అందులో ఒరిజినాలిటీ కనిపించదు.

కానీ ఎన్టీఆర్ కమల్ అదే సీన్ చేస్తే సోల్ కనిపిస్తుంది ఒరిజినాలిటీ కనిపిస్తుంది. చాలా వరకు మిగతా హీరోలు చేస్తే అందులో అత్యధిక భాగం ఫేక్ గానే వుంటాయి' అని తెలిపారు కన్మణి.

ప్రస్తుతం దర్శకుడు కన్మణి చేసిన వ్యాఖ్యలకు నెట్టింట వైరల్ గా మారాయి. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్న నేపథ్యంలో కన్మణి వీడియోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ 'ట్రిపుల్ ఆర్'లో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ప్రీ క్లైమాక్స్ సన్నివేశంలో ఎన్టీఆర్ ని శిక్షిస్తున్న సమయంలో ఆయన పలికించిన హావ భావాలు స్పీచ్ లెస్.

ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ పెర్ఫార్మెన్స్ తో 'ట్రిపుల్ ఆర్'కు సోల్ గా నిలిచాడు. సినిమాకు హైలైట్ అయ్యాడు. ఇదే సీన్ ని అభివర్ణిస్తూ తమిళ దర్శకుడు కన్మణి చెప్పిన మాటలు ఇప్పడు నెట్టింట వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాకు రెడీ అయిపోతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురానున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని మే 20న బర్త్ డే స్పెషల్ గా మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు.

Scroll to Top