BY T20,
'హిందీ' భాషపై సినీ ఇండస్ట్రీలోని ఇద్దరు అగ్ర నటుల మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ స్టార్ సుదీప్ చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ చేసిన ట్వీట్స్ హీట్ పుట్టించాయి.
‘హిందీ’ భాషకు సంబంధించిన వివాదంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, శాండిల్‌వుడ్ కిచ్చా సుదీప్ మధ్య ట్వీట్‌వార్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిందీ జాతీయభాష కాదని సుదీప్ వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపై దుమారం చెలరేగింది. హిందీ జాతీయ భాష కానప్పుడు… మీ కన్నడ సినిమాలను హిందీలో డబ్ చేస్తున్నారు కదా ? జాతీయ భాషగా హిందీ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ అదే ఉంటుంది… అంటూ సుదీప్‌కు కౌంటరిచ్చారు అజయ్ దేవగన్. అయితే తన ట్వీట్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని అజయ్‌దేవగన్‌కు జవాబిచ్చారు సుదీప్. హిందీ అంటే తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. కేజీఎఫ్ సినిమా నార్త్ ఇండియాలో సూపర్ హిట్టయిన విషయాన్ని ప్రస్తావించారు సుదీప్. కన్నడ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తీశారని, ఈవిషయం హిందీ జాతీయ భాష కాదని నిరూపించిందని అన్నారు సుదీప్. మీరు హిందీలో పెట్టిన ట్వీట్‌ను నేను చదవగలిగా. అదే నా సమాధానాల్ని కన్నడలో రాస్తే పరిస్థితి ఏంటి సర్? చదవగలరా అంటూ ప్రశ్నించాడు సుదీప్. అయినా మనమంతా భారతీయులమే కదా.. నేను రెచ్చగొట్టాలని చెప్పడం లేదంటూ పేర్కొన్నాడు.
Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
ట్రాన్స్‌లేషన్‌లో పొరపాట్ల వల్ల ఏదైనా తప్పుగా ప్రచారమై ఉంటుందని కిచ్చా సుదీప్‌కు రిప్లై ఇచ్చారు అజయ్ దేవగన్. సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటేనని తాను భావిస్తుంటానని… అన్ని భాషలను మేం గౌరవిస్తాం. అందరూ అలాగే గౌరవించాలని అనుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. దీనికి మరోసారి కౌంటరిచ్చారు సుదీప్. “ట్రాన్స్లేషన్లు, వివరణలు మన ఆలోచన తీరులోనే ఉంటాయి. నేను మీపై నిందలు వేయట్లేదు. కానీ, మంచి విషయాల్లో మీ నుంచి ట్వీట్ వచ్చి ఉంటే నేను అభినందించేవాడిని. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం” అని సుదీప్ తెలిపారు.
Translation & interpretations are perspectives sir. Tats the reason not reacting wothout knowing the complete matter,,,matters.:)
I don't blame you @ajaydevgn sir. Perhaps it would have been a happy moment if i had received a tweet from u for a creative reason.
Luv&Regards❤️ https://t.co/lRWfTYfFQi— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
తెలుగు, కన్నడ సినిమాలు దేశవ్యాప్తంగా హిట్ అవుతుంటే, ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతుంటే .. దక్షిణాది భాషల్లో డబ్ చేసిన హిందీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అన్నారు సుదీప్. సుదీప్ వ్యాఖ్యలపై అజయ్‌దేవగన్‌కు కౌంటర్ ఇవ్వడంతో ఈ టాపిక్ నెట్టింట హీట్ రేపింది.