Alia Bhatt : నువ్వు తాగవు కానీ మమ్మల్ని తాగమని ప్రమోట్ చేస్తున్నావా.. అలియాపై ట్రోలింగ్..

BY T20,

ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్‌ హీరోహీరోయిన్లను వరుసగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

పాన్‌ మసాలా యాడ్‌లో నటించినందుకు అక్షయ్‌ కుమార్ పై బాగా ట్రోల్ చేశారు. కొంతమంది నటీమణులు ఆల్కహాల్ ని ప్రమోట్ చేయడంతో వారిపై కూడా ట్రోలింగ్ చేశారు. తాజాగా కొత్త పెళ్లికూతురు అలియా భట్ పై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అందుకు కారణం ఓ కూల్ డ్రింక్ యాడ్ ని ప్రమోట్ చేయడమే.

అయితే కూల్ డ్రింక్ ని అందరూ ప్రమోట్ చేస్తారు కదా, దానికి ట్రోల్ చేయడం ఎందుకు అనుకుంటున్నారా? గతంలో అలియా భట్ ఓ సారి కపిల్ శర్మ షోకి వచ్చినప్పుడు తాను అసలు చక్కర ఉండే పదార్థాలని తినను, తాగాను, అది హెల్త్ కి అస్సలు మంచిది కాదు. ఆర్టిఫీషియల్ షుగర్ అస్సలు తీసుకోను అని చెప్పింది. కేవలం పండ్ల ద్వారానే చక్కర పదార్థాన్ని తీసుకుంటాను అని చెప్పింది. అయితే ఇటీవల ఓ కూల్ డ్రింక్ ని ప్రమోట్ చేస్తుండటంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

మీరు మీ లైఫ్ లో చక్కర, చక్కర ఉన్న పదార్థాలని మాత్రం తీసుకోరు. మాకు మాత్రం తాగమని చెప్తారు. డబ్బులు ఇస్తే యాడ్స్ చేసేస్తారు. మీ ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు, మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు మీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి మాత్రం తాగమని ఎలా చెప్తారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Scroll to Top