BY T20,
సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో హాస్యాస్పద సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్. ఏడాదికి రెండు మూడు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తుంటాడు.
యువ దర్శక, నిర్మాతలకు కామెడీ జోనర్లో సినిమా చేయాలంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్. అంతలా ఈయన తన నటన, కామెడీ టైమింగ్‌తో రెండు గంటలు హాయిగా నవ్వుకునేలా చేస్తాడు. అయితే గతకొంత కాలంగా ఈయన సినిమాలు ఒకే పంతాలో ఉండటంతో ప్రేక్షకులు నరేష్ సినిమాలను థియేటర్లలో చూడటానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. దాంతో నరేష్ రోటీన్‌కు భిన్నంగా గతేడాది 'నాంది' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీని పక్కన పెట్టి మొదటి సారి పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. ఈ సినిమాలో నరేష్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా అల్లరి నరేష్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే నరేష్ మరో సిరీయస్ పాత్రలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమాను చేస్తున్నాడు. రాజ్‌మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను గత నెలలో మేకర్స్ విడుదల చేశారు. టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో నరేష్ మంచం కాలు పట్టుకుని ఎవర్నో కోల్పోయినట్టు బాధతో చూస్తున్నట్లు ఉంది. ఈ పోస్టర్‌ను గమనిస్తే నాంది తరహాలో మరో ఫుల్ లెంగ్త్ సీరియస్ పాత్రలో నటించనున్నాడు. నరేష్‌కు జోడీగా బస్‌స్టాప్ ఫేం ఆనంది హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో అల్లరినరేష్ ఎలక్షన్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
#Naresh59 #ItluMaredumilliPrajaneekam #IMP @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @SricharanPakala pic.twitter.com/oIPsid6p6H
— Allari Naresh (@allarinaresh) May 10, 2022