‘పుష్ప’ పాన్ ఇండియా క్రెడిట్ మొత్తం బన్నీదేనట!

BY T20,

ఈ మద్య కాలంలో సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం పాన్ ఇండియా. సౌత్ భాషల్లో తెరకెక్కిన సినిమా లు మొత్తం ఇండియాలో కూడా  డబ్ అయ్యి ఆడుతున్నాయి అంటే అది సినిమా యొక్క గొప్పతనం.. ప్రతి సినిమా కూడా అలా ఆడే అకాశం లేదు. హీరోలకు హీరోయిన్స్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్నా కూడా కొన్ని సార్లు సినిమా లు నిరాశ పర్చుతూ ఉన్నాయి.

పుష్ప పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రథాన కారణం అల్లు అర్జున్ అనే ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమా ను ఉత్తరాది అభిమానులు అంతగా ఆధరించారంటే గతంలో అక్కడ అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ అంటూ కొందరు మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పుష్ప సినిమా సక్సెస్ క్రెడిట్ లో సుకుమార్ కు భాగస్వామ్యం అక్కర్లేదు అనేది కొందరి వాదన.

అల్లు అర్జున్ స్టార్ డమ్ వల్లే సినిమా అంతగా అక్కడ ఆడింది అంటూ కొందరు చేస్తున్న వాదనను జనాలు కొట్టి పారేస్తున్నారు. అల్లు అర్జున్ కు ఉన్నంత స్టార్ డమ్ కంటే కూడా రెట్టింపు స్టార్ డమ్ ఉన్న హీరోలు ఉన్నారు. అలాంటి వారు నటించిన సినిమాలు అక్కడ ప్లాప్ అవుతున్నాయి కదా అనేది కొందరి వాదన. హీరోల కంటే కూడా దర్శకుడి పని తీరు వల్ల సినిమా బాగుంటుంది.. అప్పుడే అక్కడ లేదా ఇక్కడ సక్సెస్ దక్కుతుంది.

పుష్ప సినిమా ను సుకుమార్ చాలా ప్లాన్ గా మంచి స్క్రిప్ట్ తో మొదలు పెట్టాడు. లక్కీ గా సినిమా అన్ని భాషల వారిని ఆకట్టుకునేలా నిలిచింది. పాన్ ఇండియా సినిమా అన్నట్లుగా సుకుమార్ పుష్ప ను రూపొందించలేదు. అయినా కూడా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లను నమోదు చేసింది. ప్రతి ఒక్కరిని కూడా పుష్ప సినిమా ఆకట్టుకునేల చేసింది సుకుమార్ మరియు బన్నీ కనుక ఇక్కడ ప్రత్యేకంగా పుష్ప సక్సెస్ ను బన్నీ క్రెడిట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు.

పుష్ప 2 సినిమా కూడా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే తప్పుకుండా అప్పుడు సుకుమార్ కు స్వయంగా మెగా ఫ్యాన్స్ కూడా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అనే గుర్తింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం కూడా.. పుష్ప 2 సినిమా పై సుకుమార్ మరింత శ్రద్ద పెట్టి ఎక్కువ సమయం తీసుకోవడానికి కూడా కారణం అదే అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.

Scroll to Top