అంతరిక్షంలో టిక్‌టాక్‌ వీడియో.. చరిత్ర సృష్టించిన వ్యోమగామి

BY T20,

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ నలుమూలల్లో జరుగుతున్న వింతలు, విశేషాలు నిమిషంలో మన కళ్లముందుంటున్నాయి. అంతేకాదు కొత్త కొత్త ట్రెండింగ్ వీడియోలు, ఆకర్షణీయమైన ప్రదేశాలతో నెటిజన్లను మురిపిస్తుంది.

ఇదంతా ఒకవైపు అయితే మీరెపుడైనా అంతరిక్షం నుంచి కూడా ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేయడాన్ని చూశారా? ఇటీవల స్పేస్‌ఎక్స్ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి ఇటీవల అంతరిక్షం నుండి ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

యూరోపియన్ స్పేస్ ఏజన్సీ వ్యోమగామి ఏప్రిల్ 27న సమంతా క్రిష్టోపోరెట్టి ఆరు నెలల బస కోసం కక్ష్యలో ఉన్న ల్యాబ్‌లో దిగారు. అయితే దానికి సంబంధించిన విషయాలను టిక్ టాక్ వీడియో ద్వారా మే 5న పోస్ట్ చేశారు. దీంతో అంతరిక్షంలో మొట్టమొదటి టిక్‌టాకర్‌గా రికార్డ్ సృష్టించగా.. అందులో రెండు జీరో-జి సూచికలు, ఎట్టా అనే కోతి బొమ్మను చూపిస్తూ 88 సెకన్లపాటు రికార్డ్ చేశారు.

ఇక ఎట్టా గురించి వివరించిన వ్యోమగామి.. స్కిమ్మిట్టా సంక్షిప్తమైన చిన్న కోతికి 'ఇటాలియన్' పేరు పెట్టినట్లు తెలిపింది. అలాగే క్రిష్టోఫోరెట్టి స్పేస్ నుంచి ఒక వీడియోను చూపిస్తూ స్పేస్ X క్రూ-4 మిషన్‌లో మొదట కొన్ని రోజులు ఉత్సాహంగా గడిచినట్లు వివరించారు. అంతేకాదు వీలైనంత త్వరగా క్రూ-3 బృందం నుంచి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.

Scroll to Top