వైరల్ వీడియో: రన్ వేపై రెండుగా చీలిన బోయింగ్ విమానం..

BY T20,

కోస్టారికా దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.  బోయింగ్ 757-200 విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం రెండుగా చీలింది. అయితే ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం గమనార్హం.

కోస్లారికాలో ఓ బోయింగ్ విమానం గాల్లో ఉన్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి అడిగాడు. పైలెట్ అనుమతి అడిగిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. కోస్టారికాలోని జువాన్ శాంటమారియా ఇంటర్నేషన్  ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అధికారులు  అనుమతివ్వడంతో ఆ విమానం రన్ వే పై సేఫ్ గా ల్యాండ్  అయ్యింది.

ఇక ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాబట్టి ఆ విమానంకు ఏమైనా జరగవచ్చని భావించిన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ విమానం ల్యాండ్ అవగానే ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే అది ప్రమాదానికి గురికావడంతో అక్కడి ఎయిర్ పోర్టు సిబ్బంది ఆందోళన చెందారు. రన్ వేపై ల్యాండ్ అయిన ఈ విమానం కాస్తా దూరం ప్రయాణించి ఆ తర్వాత నియంత్రణ కోల్పోయి హఠాత్తుగా రెండుగా చీలింది. దీంతో అక్కడి వాతావరణం గందరగోళంగా మారింది.

రెండుగా చీలిన ఈ విమానంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం గమనార్హం. ఈ కారణం ఈ విమానం ప్యాసింజర్ విమానం కాదు.. గూడ్స్ విమానం. విమానంలో ఉన్న సిబ్బందికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే అందులోని ఒక సభ్యుడిని మాత్రం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్ టెస్టులకు పంపారు.

పసుపురంగులో ఉన్న ఈ విమానం డీహెచ్ఎల్ సంస్థకు చెందింది. ఇది వస్తు రవాణా విమానం. ఈ విమానం రెండుగా చీలడంతో దీని తోక మరో రన్ వైపై పడింది. ఓ రెక్క తెగి పడింది. విమానం ధ్వంసమైంది. అందులోని సరుకు మాత్రం నష్టం వాటిల్లలేదు.

ఈ విమానం గ్వాటెమాల నగరానికి వెళుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీని హైడ్రాలిక్ వ్యవస్థ పాడైందని కోస్టారికా సివిల్ ఏవియేషన్ అధికారి లూయిస్ మిరాండా మనో తెలిపారు. పైలెట్లు ఏమాత్రం ఆలస్యంచేయకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరాడని తెలిపారు. విమానం రన్ వేపై పడడంతో దాన్ని తొలిగించే వరకూ ఐదు గంటల పాటు ఎయిర్ పోర్టును బంద్ చేశారు.

Scroll to Top