జెలసీతో కూడుకున్న డైలమాలో హిందీవోళ్లు!

BY T20,

అవతార్ రిలీజ్ తర్వాత హాలీవుడ్ పై విశ్లేషణలు మారాయి. అలాగే బాహుబలి విడుదల తర్వాత సౌత్ సినిమా పై విశ్లేషణలు అమాంతం యూటర్న్ తీసుకున్నాయి. ఆ తర్వాత సౌత్ హవా నార్త్ లోనూ కొనసాగుతోంది. తగ్గేదేలే అంటూ తెలుగు సినీపరిశ్రమ నుంచి వరుస పాన్ ఇండియా చిత్రాలు విడుదలై హిందీలోనూ బంపర్ హిట్లు కొడుతున్నాయి.

ఇటీవల పుష్ప వేవ్ తర్వాత ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 సంచలన విజయాలు సాధించాక హిందీ ఫిలింమేకర్స్ డిఫెన్స్ లో పడిపోయారు. తమలో లేనిది ఏంటీ సౌత్ మేకర్స్ లో ఉన్నదేంటీ? అంటూ అంతా తర్జనభర్జన పడుతున్నారు. హిందీ స్టార్ హీరోలు దర్శకనిర్మాతల్లో జెలసీతో కూడుకున్న ఇది డైలమా సీజన్ అని చెప్పాలి.

సౌత్ వాళ్లు వచ్చి నార్త్ ని ఢీకొడుతుంటే .. ఇప్పుడు అనూహ్యంగా నార్త్ వాళ్లు వెళ్లి సౌత్ ని ఢీకొట్టాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. అంటే ఈసారి బాలీవుడ్ స్టార్లు నటించేవి కూడా సౌత్ లో ఆడాలి. బంపర్ హిట్లు కొట్టాలి. కానీ ఇది సాధ్యమేనా? అంటే దానిపై ఒక్కొక్కరు ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. ఉత్తరాది మీడియాలో ముంబై పరిశ్రమలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. వాళ్లకు ఉన్నదేంటీ మనకు లేనిదేంటీ? అన్నదే చర్చగా మారింది.

బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం సహా ఇతరులు ఇప్పటికే సౌత్ - నార్త్ స్టార్ల టై అప్ లతో సినిమాలు తీస్తున్నారు. సౌత్ దర్శకులు టెక్నీషియన్లతో కలిసి పని చేసేందుకు ప్లానింగ్ సిద్ధం చేసుకుంటున్నారు.  అదే క్రమంలో నార్త్ డైరెక్టర్లకు పెను సవాల్ ముందుందన్న చర్చా సాగుతోంది. ఇకపై నార్త్ లో సినిమా తీస్తే అది కచ్ఛితంగా సౌత్ లోనూ సత్తా చాటాలి. లేదంటే సౌత్ ఫిలిం మేకర్స్ ముందు తీసికట్టుగా మారుతుందన్న చర్చా మొదలైంది.

బాహుబలి రిలీజ్ తర్వాత సౌత్ వేవ్ నార్త్ లో ఎలా ఉంటుందో మొట్టమొదటగా ఊహించి రాసింది తుపాకి డాట్ కాం. ఉత్తరాది దక్షిణాది అనే సరిహద్దుల్ని తొలగించాలని ఆకాంక్షించింది తుపాకి డాట్ కాం. ఇండియన్ సినిమా ఒక్కటే అని కూడా పేర్కొన్నాం. దానికి తగ్గట్టే సానుకూల పరిణామాలు ఇటీవల కనిపిస్తున్నాయి. బాహుబలి-బాహుబలి 2- కేజీఎఫ్ 1 - కేజీఎఫ్ 2 - పుష్ప- ఆర్.ఆర్.ఆర్ ఇవన్నీ సంచలన విజయాల్ని నమోదు చేసాయి.

పాన్ ఇండియా పాన్ వరల్డ్ ని ఢీకొట్టే సత్తా తెలుగు సినీపరిశ్రమకు సౌత్ కి ఉందని నిరూపించాయి. ఈ పోటీని బాలీవుడ్ ప్రముఖులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇకపై పప్పులుడుకుతాయా? అన్న డైలమా అందరిలోనూ ఉంది. ఖాన్ లు సౌత్ - నార్త్ క్రాస్ బ్రీడ్ స్టోరీల కోసం ఎగబడుతున్నారు. అలాగే సౌత్ డైరెక్టర్లు టెక్నీషియన్లలో పనితనం ఉన్నవాళ్లను ఎంపిక చేసుకుని ఉత్తరాది- దక్షిణాది మార్కెట్లను కొల్లగొట్టే మంత్రం ఏమిటో చెప్పమని అడుగుతున్నారు. అయితే ఇంత చేసినా కానీ నార్త్ ముఖాల్ని సౌత్ లో చూస్తారా?  వెంటనే అంగీకరిస్తారా? అంటే డౌటౌ!!

రాజ్ కుమార్ హిరాణీ పప్పులుడుకుతాయా?

నార్త్ లో సంచలనాలు సృష్టించిన డజను మంది పైగా టాప్ డైరెక్టర్లు ఉన్నారు. ఇందులో రాజ్ కుమార్ హిరాణీ- రోహిత్ శెట్టి- కరణ్ జోహార్- ఇంతియాజ్ అలీ-విశాల్ భరద్వాజ్-భన్సాలీ- ఫర్హాన్ అక్తర్-నీరజ్ పాండే- అశుతోష్ గోవారికర్ - జోయా అక్తర్ .. లాంటి ప్రముఖులంతా ఇప్పుడు సౌత్ - నార్త్ క్రాస్ బ్రీడ్ స్టోరీల కోసం వెతకాల్సిన సన్నివేశం కనిపిస్తోంది.

ఇక ఇందులో రాజ్ కుమార్ హిరాణీ అంటే ఒక సంచలనం. యూనిక్ కాన్సెప్టులతో అతడు ప్రతి సినిమాని సంచలనంగానే మలిచారు. అరుదైన రికార్డులతో మోతెక్కించారు. అతడు ఇప్పుడు షారూఖ్ ఖాన్  తదుపరి చిత్రం షూటింగ్ ను ముంబైలో ప్రారంభించాడు. పఠాన్ - అట్లీ  చిత్రీకరణల అనంతరం షారుఖ్ ఖాన్ .. రాజుకుమార్ హిరాణీ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 15 న శుక్రవారం నాడు ఫిల్మ్ సిటీలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నది. కొన్ని సంవత్సరాల పాటు అనేక చర్చల తర్వాత రాజ్కుమార్ హిరానీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు షూటింగ్ ను ప్రారంభించారు.

తాజా లీక్ ప్రకారం.. ఈ చిత్రం సోషల్ కామెడీ అని తెలిసింది. ఇది వలసల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతోంది. ఇందులో తాప్సీ పన్ను కూడా  ఒక నాయిక. అయితే మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. ఈ చిత్రం శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. తాప్సీ సన్నివేశాలను హిరాణీ తెరకెక్కిస్తున్నారని సమాచారం. షారుఖ్ ఖాన్ టీమ్ ని కలవడానికి సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకున్నారని తెలిసింది. కానీ ఏప్రిల్ 16న షూటింగ్ ప్రారంభించాడు.

ఇదంతా సరే కానీ.. అట్లీ తరహాలోనే ఇప్పుడు రాజ్ కుమార్ హిరాణీ కూడా సౌత్ - నార్త్ క్రాస్ బ్రీడ్ కథను ఎంచుకున్నాడా?  రెండు చోట్లా బంపర్ హిట్లు కొడతారా? అన్నదే ఇప్పుడు అసలైన టాస్క్. హిరాణీ కథలు యూనివర్శల్ అనడంలో సందేహం లేదు. అయితే షారూక్- హిరాణీ కాంబో సౌత్ లో ఏమేరకు మ్యాజిక్ చేస్తుంది? అన్నదే ఆలోచించాలి. ఆర్.ఆర్.ఆర్ - పుష్ప - కేజీఎఫ్ 2 వేవ్ ని వీళ్లు తేగలరా? అన్నది చూడాలి. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. తుపాకి పాఠకుల కోసం ఈ ఎక్స్ క్లూజివ్ విశ్లేషణ.

Scroll to Top