ఫ్యాన్ ధరకే ఏసీ.. కేవలం రూ. 1800 మాత్రమే

BY T20,

ఎండలు విపరీతంగా పెరిగాయి. ఫ్యాన్, ఏసీ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఎండ వేడి పెరగడంతో ఏసీలు, కూలర్లకు కూడా డిమాండ్ అంతే వేగంగా పెరిగింది.

దాంతో కంపెనీలు కూడా ఏసీలు, కూలర్ల ధరలను భారీగా పెంచాయి. పెరిగిన ధరలతో చాలామంది ఏసీ కొనాలంటేనే వెనకడుగు వేస్తారు. పైగా ఏసీ వాడితే కరెంట్ బిల్ వాచిపోతుందని భయపడతారు. అలాంటి వారందరికీ చల్లచల్లని కబురు. కేవలం ఫ్యాన్ ధరతోనే ఏసీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏసీ వల్ల కరెంట్ బిల్ కూడా ఎక్కువగా రాదు.

LUCHILA Go ఆర్కిటిక్ ఎయిర్ కండీషనర్ లేదా CAMPFIRE Go ఆర్కిటిక్ ఎయిర్ కండీషనర్ పోర్టబుల్ ఏసీలు. వీటిని పోర్టబుల్ ఏసీ లేదా కూలర్‎గా భావించవచ్చు. ఇవి చాలా తక్కువ విద్యుత్ వినియోగంతో గది మొత్తాన్ని చల్లబరుస్తాయి. వీటిలో హైడ్రో చిల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ఆవిరి శీతలీకరణ వడపోత ద్వారా వేడి గాలిని చల్లబరుస్తుంది. ఈ ఫిల్టర్ల ద్వారా వేడి గాలి చాలా చల్లగా మారుతుండటంతో వేడి నుండి చాలా ఉపశమనం లభిస్తుంది. ఈ రెండు ఎయిర్ కండీషనర్‌ల పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. ఇవి మల్టీ డైరెక్షనల్ ఎయిర్ వెంట్‌ను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని ఇంట్లోని ఏ గదిలోనైనా వాడుకోవచ్చు. వీటికున్న మరో విశేషం ఏంటంటే.. సాధారణ ఏసీ లేదా కూలర్‌తో పోలిస్తే.. వీటి విద్యుత్ వినియోగం సగం కూడా ఉండదు. అంటే తక్కువ డబ్బు, తక్కువ విద్యుత్ ఖర్చుతో వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు.

ఈ ఏసీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉన్నాయి. వీటి అసలు ధర 4, 999 రూపాయలు కాగా, డిస్కౌంట్‌తో కేవలం 1800 రూపాయలకే లభిస్తున్నాయి. వీటి ధర మోడల్‎ను బట్టి రూ. 1,799 నుంచి మొదలవుతోంది. అంతేకాకుండా.. ఆన్‌లైన్ షాపింగ్‌పై అనేక బ్యాంకులు ఆఫర్‌లను కూడా అందిస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.500 నుంచి రూ.2,000 వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Scroll to Top