Chiranjeevi: చిరంజీవిపై కోట షాకింగ్ కామెంట్స్.. ఇలా రివర్స్ అయ్యారేంటి..

BY T20,

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా స్టార్ గా చలామణి అవుతున్న చిరంజీవి ( Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటనలోనే కాదు ఇతరులను ఆదుకోవడంలో కూడా ముందు ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు.

ఇలాంటి గొప్ప హృదయ భావం కలిగిన చిరంజీవి తో డిబేట్ కి సిద్ధం అంటున్నారు సీనియర్ ఆర్టిస్ట్.. అయితే ఎందుకు చిరంజీవి తో డిబేట్ పెట్టుకోవడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారు.. అసలు ఏమైంది అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

విలక్షణ నటుడిగా చిత్ర పరిశ్రమలో.. క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు.. ఆ తర్వాత బాబు మోహన్ తో కలిసి ఎన్నో సినిమాలలో కామెడీని కూడా పండించారు. వయసు మీద పడడంతో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు అని చెప్పవచ్చు.ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నో యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు వైరల్ గా.. డిబేట్ గా కూడా మారుతూ ఉంటాయి. ఇక ప్రముఖ యంకర్ అనసూయ కూడా ఎవరో తెలియదా అంటూ ఆమెపై చేసిన కామెంట్లు సైతం వివాదానికి దారితీశాయి.

ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన కోటశ్రీనివాసరావు.. మెగాస్టార్ చిరంజీవిపై కూడా డిబేట్ కి సిద్ధం అన్నట్లు తెలుస్తోంది. మే డే సందర్భంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగానే చిరు మాట్లాడుతూ తాను కూడా సినీ కార్మికుడు అని చెప్పి కార్మికులకోసం చిత్ర పురి లో ఆసుపత్రి కట్టిస్తాను అని వెల్లడించారు.. అయితే దీనిపై కోట శ్రీనివాసరావు స్పందిస్తూ.. ముందు కార్మికులకు ఫుడ్డు పెట్టడం నేర్చుకోండి.. ఆ తర్వాత ఆస్పత్రి కట్టించండి.. అంతే కానీ చిరంజీవి కట్టే ఆస్పత్రికి ఎవరు వస్తారు అంటూ కూడా ప్రశ్నించారు. ప్రతిభ ఉండి కూడా ఎంతోమంది పని లేక కృష్ణానగర్లో ఆకలితో అలమటించడమే కాకుండా వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కూడా కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతాడు అని కూడా ప్రశ్నించారు. చిరంజీవి అంటే ఎంతో గౌరవం ఉంది అని కానీ ఇలాంటి మాటలు చెబుతూ ఉంటే ఆయన పై గౌరవం పోతుంది అంటూ చిరంజీవి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు కోట శ్రీనివాసరావు.

Scroll to Top