మేమంతా ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉంటే మీకు సరదాలు కావాల్సి వచ్చిందా మెగాస్టార్?

BY T20,

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఎట్టకేలకు ఈ సినిమా ఏప్రిల్ 29 వ తేదీ విడుదల అయి ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం చేరుకోలేదని చెప్పాలి.

మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలను తీసుకువచ్చింది.

ఆచార్య సినిమాని అధిక ధరలకు కొనుగోలు చేసిన బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు ఏ మాత్రం లేకపోవడంతో వీరందరూ తీవ్ర నష్టాలలో కోర్టుకు పోయారు. ఈ సమయంలోనే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బయ్యర్లు తమను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని ఆశతో గత మూడు రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి విదేశీ పర్యటన వెళ్లడంతో బయ్యర్లు లబోదిబో మంటున్నారు.

వీరి పరిస్థితి తెలిసి ఆయన విదేశీ పర్యటన వెళ్లారో లేదో తెలియదు కానీ, బయ్యర్లు మాత్రం మెగాస్టార్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ విషయం గురించి ప్రస్తావించాలని భావించారు.

ఈ క్రమంలోనే వీరికి మరో షాక్ తగిలింది. మెగాస్టార్ చిరంజీవి అమెరికా యూరప్ పర్యటనలో భాగంగా నెల రోజుల తర్వాత తిరిగి ఇంటికి వస్తారని తెలియడంతో ఒక్కసారిగా బయ్యర్లు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మేము ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉంటే మీకు సరదాలు కావాల్సి వచ్చిందా అంటూ బయ్యర్లు వారి బాధను బయట పెడుతున్నారు. మరి వీరి సమస్యకు మెగాస్టార్ పరిష్కారం చూపుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Scroll to Top