విశ్వక్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. లైవ్ లో ‘గెట్ ఔట్’ అంటూ టీవీ9 యాంకర్ ఫైర్..!

BY T20,

టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ పై హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కంప్లైంట్ చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నడిరోడ్డుపై హంగామా సృష్టించినందుకు విశ్వక్ పై చర్యలు తీసుకోవాలని అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.

మూవీ ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం స్వీకరించింది.

వివరాల్లోకి వెళ్తే.. విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రం మే 6న థియేటర్లలో విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా వెరైటీగా ఓ యువ యువకుడు పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకోడానికి ట్రై చేసినట్లు ఓ ఫ్రాంక్ వీడియో చేశారు.

విశ్వక్ సేన్ ఫిలింనగర్ వైపుగా వెళ్తుండగా.. ఓ యువకుడు కారుకు అడ్డంగా పడుకొని నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో విశ్వక్ సేన్ పోషించిన పాత్ర అల్లం అర్జున్ కుమార్ కు 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. దాన్ని తట్టుకోలేకపోతున్నా. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ సీన్ క్రియేట్ చేశారు.

విశ్వక్ సేన్ సైతం తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తికట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆత్మహత్యయత్నం పేరుతో ఫ్రాంక్ వీడియోతో నడిరోడ్డుపై రచ్చ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం పై నెటిజన్లు ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పేరిట న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్ పై అడ్వొకేట్ అరుణ్ కుమార్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

దీనిపై వివరణ ఇచ్చేందుకు విశ్వక్ సేన్ సోమవారం ఉదయం Tv9 స్టూడియో డిబేట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను ఉద్దేశిస్తూ 'డిఫ్రెష్డ్ పర్సన్' 'పాగల్ సేన్' అని యాంకర్ పేర్కొనడంపై విశ్వక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పరువునష్టం దావా వేసే హక్కు తనకు ఉందని.. కానీ తాను అలా చేయనని అన్నారు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగడంతో సహనం కోల్పోయిన సదరు యాంకర్.. 'గెట్ ఔట్' అంటూ షో నుంచి విశ్వక్ సేన్ ను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ డిబేట్ కు పిలిచింది మీరే అనే విషయాన్ని ప్రస్తావిస్తూ విశ్వక్ బయటకు వచ్చేసారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.

Scroll to Top