ఎఫ్ 3 ట్రైలర్ తో అదరగొట్టిన వెంకీ – వరుణ్ !

BY T20,

విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక్కసారిగా సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ట్రైలర్ లో వెంకీ నుండి వైవిధ్యం కనిపించడం.. అన్నిటికీ మించి వెంకీ – వరుణ్ గెటప్ సెటప్ అందరి పోవడంతో కామెడీ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఈ ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా ‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు, కానీ ఆరో భూతం ఒకటి ఉంది, అదే డబ్బు…అంటూ ట్రైలర్ మొదలై.. చివర్లో అంతేగా అంతేగా అంటే.. ఈడికి సీక్వెల్ లో కూడా సేమ్ డైలాగా ? అంటూ ట్రైలర్ ముగించడం బాగుంది. ఇక ట్రైలర్ లో డైలాగ్స్ తో పాటు టేకింగ్ అండ్ విజువల్స్ కూడా బాగున్నాయి. ఎఫ్ 2 కి సీక్వెల్ అంటేనే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. అందుకే మొదటి నుండి అనిల్ రావిపూడి ఈ సినిమా పై మరింత కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా సినిమా తీశాడు.

ఈ ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. పైగా ఈ ట్రైలర్ లో కామెడీ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తన ఎనర్జిటిక్ సాంగ్స్ తో సినిమా స్థాయిని పెంచుతున్నాడు దేవి. ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Scroll to Top