తాళి కట్టే వేళ పవర్ కట్ : చెల్లెలి కాబోయే భర్తతో అక్కకు మనువు ఆపై..

BY T20,

అక్కాచెల్లెళ్లకు ఒకే ముహుర్తంలో మనువు కుదిరింది. సరిగ్గా తాళికట్టే సమయంలో కరెంట్ పోవడంతో పెండ్లి మంటపంలో చీకట్లు కమ్ముకున్నాయి. అక్కాచెల్లెళ్లు ఒకే రకమైన పెండ్లి దుస్తుల్లో ఉండటంతో పొరబడిన చెల్లెలి కాబోయే భర్త ఆమె అక్కను మనువాడాడు.

అక్కను పెండ్లి చేసుకోవాల్సిన వరుడు ఆమె చెల్లెలి మెడలో వరమాల వేశాడు. రమేష్‌లాల్ ఇద్దరు కూతుళ్లు నికిత, కరిష్మాలకు ఆదివారం రాత్రి దంగ్వార భోలా, గణేష్‌లతో పెండ్లి జరగాల్సి ఉండగా జంటల విషయం తారుమారైన సంగతి ఎవరూ గుర్తించలేదు.

పురోహితుడు సైతం పెండ్లి కుమార్తెలు అటుఇటు అయిన సంగతి చూసుకోకుండా వివాహ తంతు జరిపించాడు. పెండ్లి కుమారులు తమ ఇంటికి వధువులను తీసుకువెళ్లిన తర్వాత పొరపాటు జరిగిందని గుర్తించారు. స్వల్ప వివాదం అనంతరం సమస్యను పెద్దలు పరిష్కరించారు. మరుసటి రోజు మళ్లీ పెండ్లి తంతు నిర్వహించాలని నిర్ణయించారు.

Scroll to Top