BY T20,
ఇండియాలో financial sectorలో scams సర్వసాధారణం. ICICI Bank – చందా కొచ్చెర్ స్కాం, నిరావ్ మోడీ స్కాం.. ఇలా చెప్పుకుంటూ పొతే లిస్టు చాలా పెద్దది. కాని, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక స్కాం చాలా స్పెషల్. ఈ స్కాం లో కంపెనీలో ఉన్నత అధికారితో పాటు ఒక హిమాలయన్ యోగి ప్రమేయం కూడా ఉండడం విశేషం.
NSE, SEBI:
30 సంవత్సరాల క్రితం ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక పద్ధతిలో ఉండేది కాదు. కాని 1994 లో NSE online ట్రేడింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చాక ప్రపంచం నలుమూల నుండి పెట్టుబడులు రావడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఆశాజనక మార్కెట్స్ లో ఇండియన్ మార్కెట్ ఒకటిగా ఉంది అంటే దానికి పునాది NSE. NSEని కంట్రోల్ చేసే ప్రభుత్వ సంస్థ SEBI (Security and Exchange Board of India). హర్షద్ మెహత స్కాం తర్వాత దీన్ని పవర్స్ బాగా పెంచడం జరిగింది. ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ లు మోస రహితంగా, సమర్దవంతం గా పని చేసేలా చూడడం SEBI ప్రధమ కర్తవ్యం.
చిత్రా రామకృష్ణ :
ఇప్పుడు మనం చర్చిస్తున్న స్కాం లో ప్రధమ నిందితురాలు చిత్రా రామకృష్ణ. ఫైనాన్షియల్ మార్కెట్ లో ఈమె కి ఉన్న అనుభవం వల్ల SEBI నియమావళి రూపొందించడం లో కూడా ఇవిడ ముఖ్య పాత్ర వహించారు. NSE ఏర్పాటు చెయ్యాలి అనుకున్నప్పుడు అందరూ సూచించిన మొదటి పేరు కూడా చిత్రా రామకృష్ణనే. 2013లో ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్, NSEకి మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలిగా పదవి పొందారు. ఆవిడ ఈ పదవిలో 2016 వరకు కొనసాగారు. ఈ స్కాం లో రెండవ ముఖ్య వ్యక్తి ఆనంద్ సుబ్రహ్మణ్యం . ఈయన ఒక ప్రైవేటు కంపెనీ లో కన్సల్టంట్ గా పని చేసేవారు. 2013లో చిత్రా రామకృష్ణ NSE MD అయ్యాకా ఆనంద్ ను సడన్ గా NSE ముఖ్య సలహాదారునిగా నియమించారు.తర్వాతి కాలం లో చిత్రా ఆయనకు MD professional సలహాదారు పదవిని కూడా ఇచ్చారు.
NSE లో ఉండే ఇతర ఉద్యోగులకు ఈ విషయం మీద చాలా అనుమానాలు ఉండేవి. ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా అంత పెద్ద ఉద్యోగం ఆనంద్ ని వరించింది. దానితో వారు SEBIకి ఆనంద్ నియామకం మీద పిర్యాదు చేసారు.
SEBI విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. SEBI రిపోర్ట్ ప్రకారం చిత్రకు హిమాలయాలలో ఉండే యోగి ఆదేశాల మేరకు ఆనంద్ కు ఉద్యోగం ఇచ్చారు. అంతేకాకుండా, చిత్ర యోగి తన గురువని, ఆయన పేరు సిరోన్ మని అని, ఈమెయిలు ద్వారా గత 20 సంవత్సరాల నుండి తనను గైడ్ చేస్తున్నారని SEBI విచారణలో చెప్పారు. విచారణలో చిత్ర NSEకి సంబంధించిన ఒప్పందాలు, రహస్యాలు కూడా యోగి తో పంచుకున్నారని బయటపడింది.
SEBI ఆ హిమాలయన్ ఎవరు అనే దానిపై దృష్టి పెట్టింది. చిత్ర కి ఈమైల్స్ వచ్చే ఈమెయిలు ఐడి ట్రేస్ చెయ్యమని ఒక ప్రైవేటు సంస్థకు పని అప్పగించింది. చివరికి ఆ సంస్థ తేల్చింది ఏమిటి అంటే, ఆనంద్ సుబ్రహ్మణ్యంనే ఆ హిమాలయన్ యోగి అని. ఆనంద్ సుబ్రహ్మణ్యం వాడే రెండు స్కైప్ ఐడి లకి చిత్ర కి ఈమెయిల్ పంపించడానికి వాడిన ఈమెయిలు ఐడితో లింక్ అయినట్టు కనిపెట్టింది.
SEBI లాంటి ఎన్ని నియంత్రాణ సంస్థలు ఎన్ని ఉన్నా సంస్థలలో ఉన్నత స్థానం లో ఉన్న వారికి విలువలు లేక పొతే ఇలాంటి చిన్న, పెద్ద స్కాం లు జరుగుతూనే ఉంటాయి అనడానికి ఈ NSE కేసు ఒక హెచ్చరిక లాంటిది.