Ayushmann Khurrana: ఇండియనా? కాదా? అనేది హిందీ భాష డిసైడ్ చేస్తుందా? – వైరల్ అవుతోన్న డైలాగ్

BY T20,

యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, దర్శకుడు అనుభవ్ సిన్హా కాంబినేషన్ లో 'అనేక్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో జేడీ చక్రవర్తి కీలకపాత్రలో కనిపించనున్నారు.

రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానాకు, జేడీ చక్రవర్తికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సీన్ లో ఆయుష్మాన్ ఖురానా.. ఒక వ్యక్తి ఇండియన్ అని ఎలా గుర్తిస్తారనే ప్రశ్న సాధిస్తాడు.

ముందుగా జేడీ చక్రవర్తిని 'మీరు ఎక్కడివారు..?' అని ప్రశ్నిస్తాడు ఆయుష్మాన్. దానికి అతడు 'తెలంగాణ.. సౌత్' అని చెప్తాడు. వెంటనే ఆయుష్మాన్.. 'తెలంగాణ.. తమిళనాడుకి నార్త్ లో ఉంటుందని.. అప్పుడు తమిళనాడు జనాలు మిమ్మల్ని నార్త్ ఇండియన్ అని పిలవాలని' అంటారు. దానికి జేడీ 'బహుశా' అని బదులిస్తారు. 'నేను ఎక్కడ వాడినని మీరు అనుకుంటున్నారు..?' అని జేడీని ప్రశ్నిస్తారు ఆయుష్మాన్.

దానికి అతడు.. 'నార్త్ ఇండియా' అని చెబుతారు. 'మీకెందుకు అలా అనిపించిందని' అడుగుతాడు ఆయుష్మాన్. 'ఎందుకంటే మీ హిందీ చాలా నీట్ గా ఉంది' అని చెబుతారు జేడీ. 'సో ఎవరు నార్త్ వాళ్లో.. ఎవరు సౌత్ వాళ్లో.. హిందీ డిసైడ్ చేస్తుందన్నమాట' అని సందేహం వ్యక్తం చేస్తారు ఆయుష్మాన్. దానికి జేడీ 'నో..' అని చెప్తారు. 'అయితే హిందీని బట్టి కూడా డిసైడ్ చేయరన్నమాట. మరి ఎలా డిసైడ్ చేస్తారు సర్.. నార్త్ ఇండియన్ కాదు, సౌత్ ఇండియన్ కాదు, ఈస్ట్ ఇండియన్ కాదు, వెస్ట్ ఇండియన్ కాదు. ఒక వ్యక్తి కేవలం ఇండియన్ ఎలా అవుతారు..?' అని ప్రశ్నిస్తారు.

ప్రస్తుతం ఈ డైలాగ్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కిచ్చా సుదీప్, అజయ్ దేవగన్ మధ్య జరిగిన హిందీ భాష డిబేట్ నేపథ్యంలో ఇప్పుడు 'అనేక్' సినిమా ట్రైలర్ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సెలబ్రిటీలు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాప్సీ, సునీల్ శెట్టి లాంటి వారి ట్రైలర్ ను రీట్వీట్ చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Scroll to Top