ఇండియా కి రెండు రాజదానులు. ఒకటి నార్త్ ఇండియాలో.. ఇంకొకటి సౌత్ ఇండియాలో..

BY T20,

 “సౌత్ ఇండియా మీద నార్త్ ఇండియా Domination ఎక్కువ అయిపోతుంది, నార్త్ ఇండియా ఆదాయం తో పోల్చుకుంటే సౌత్ ఇండియా ఆదాయం చాలా ఎక్కువ. కానీ ఖర్చు పెట్టే విషయం లోఢిల్లీ గవర్నమెంట్ ఎప్పుడు సౌత్ ఇండియా మీద సవతి ప్రేమే చూపిస్తుంది. ఇలాంటి వాదనలు వచ్చెనపుడు దేశానికి ఎందుకు రెండు రాజధానులు ఉండకూడదు, అది ఒకటి నార్త్ ఇండియా లో ఉంటే రెండోది సౌత్ ఇండియా లో వుండాలి, వంటి ఆలోచనలు వస్తాయి.

భారత దేశానికి రెండు రాజధానులు అనేది ఇప్పుడు కొత్త విషయం ఏమి కాదు. మొగలుల కాలంలో ఢిల్లీ, శ్రీ నగర్ రాజధానులుగా ఉండేవి. అలాగే బ్రిటిష్ కాలం లో కలకత్తా, సిమ్ల రాజధానులుగా ఉండేవి.అప్పుడు రెండు రాజధానులు ఉండటానికి కారణం,  వాళ్ళు మన ఎండలు భరించలేక వేసవి లో రెండో రాజధానిని హిల్ స్టేషన్ లో పెట్టుకున్నారు. ప్రస్తుత ప్రపంచం లో కూడా కొన్ని దేశాలు రెండు రాజధానులతో నడుస్తున్నాయి. ఉదాహరణకు సౌత్ ఆఫ్రికాలో ౩ రాజధానులు, మలేషియా మరియు శ్రీలంక 2 రాజధానులతో పని చేస్తున్నాయి.

అలా ఇండియా కూడా రెండు రాజధానులతో షో రన్ చెయ్యవచ్చా? దాని వల్ల లాభాలు ఏంటి? దానికి అడ్డంకులు ఏమిటి?

లాభాలు:

1. రెండు రాజధానులు అనే ఆలోచన రావడానికి ప్రధమ కారణం “ఢిల్లీ”. ఢిల్లీ నార్త్ ఇండియాలో ఉండడం వల్ల అటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి ఇటు సౌత్ ఇండియా కి భౌతికంగా దూరంగా ఉండటంతో పాటు కల్చరల్గా కూడా చాలా తేడా ఉంటుంది. ఈ తేడాల వల్ల సౌత్ ఇండియాన్ జనాలు ఢిల్లీ తో అంతగా రిలేట్ కాలేరు. అందుకే ఒక రాజధానిని south india లో ఏర్పాటు చేస్తే దేశ సమగ్రత పెరిగి ప్రజలు వారి లోకల్ ప్లేస్ తో కాకుండా దేశంతో రిలేట్ అవ్వడం పెరుగుతుంది. అది దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యం.

2. ఢిల్లీ మన శత్రువులైన పాకిస్తాన్, చైనా బోర్డర్ కి దగ్గరగా ఉంటుంది. ఒక వేళ ఏదైనా యుద్ధం వచ్చిన పాలన యంత్రాంగం అంతా ఢిల్లీలోనే ఉండటం అనేది భద్రతా లోపం గా మారుతుంది.

3. ఢిల్లీ కి ఉన్న అతిపెద్ద సమస్యల్లో కాలుష్యం ఒకటి. సంవత్సరంలో కొన్ని నెలలు అది మరింత తీవ్రంగా ఉంటుంది.రెండోవ రాజధాని ఉంటే ఆ సమయాలలో పాలనా అక్కడ  నుండి చెయ్యొచ్చు.

4. రెండవ రాజధానిగా IT లో బాగా వృద్ధి సాధించిన “Hyderabad” లేదా  “Bangalore cities” లో పెట్టడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. INDIA start up capital గా Bangalore ని పిలుస్తారు. ఇలాంటి చోట రాజధాని ఉంటే దేశ ఆర్ధిక ప్రగతికి కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

రెండు రాజధానులకు అడ్డంకులు:

రెండు రాజధానుల ఏర్పాటు అనేది చాలా సంవత్సరాలు పాటు జరిగే ప్రక్రియ. Parliamentతో పాటు అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదం అవసరం. ఇది జరగటానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. GST లాంటి bill ఎన్నో Governments మారి ఎన్నో సంవత్సరాలు పట్టింది అమలులోకి రావడానికి. అలాంటిది రెండు  రాజధానులు అంటే GST కన్నా చాలా పెద్ద విషయం.ఒక కొత్త రాజధానిని design చేసి, నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. దీనికి చాలా డబ్బు అవసరం. రెండు రాజధానుల మధ్య Connectivity, infrastructure కి చాలా మొత్తంలో డబ్బు అవసరం. అలాంటప్పుడు డబ్బులు  రెండు రాజధానుల మీద పెట్టడం కన్నా ఉన్న రాజధాని భద్రతా, infrastructure, పేదరికం, విద్య, ఆరోగ్యం మీద పెట్టవచ్చు కదా! అన్న వాదనలు రావొచ్చు.

రెండు రాజధానులు వస్తాయో లేదో తెలియదు కాని ఎప్పటికప్పుడు ఈ అంశం మాత్రం తెర మీదకి వస్తూనే ఉంటుంది.

Scroll to Top