హనుమాన్ జయంతి అల్లర్ల నిందితుడు ‘పుష్ప’ యాక్షన్

BY T20,

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ మేనియా ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది హిందీ బెల్ట్ లో ఈ పుష్ప మేనియా ఊపేస్తోంది. ఎంతలా అంటే క్రిమినల్స్ అల్లరి మూకలు కూడా పుష్పను ఓన్ చేసుకొని అల్లు అర్జున్ లా యాక్షన్ చేస్తున్నారు.

పుష్ప మూవీలో అల్లు అర్జున్ 'తగ్గేదేలే' అన్న డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ ఫోజును సెలబ్రెటీలు క్రికెటర్లు ప్రముఖులు ఇలా అందరూ చేశారు. దీంతో తెగ పాపులర్ అయ్యింది. ఎంతో మంది ఈ ఫోజును ఫాలో అయ్యారు.

తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్ పురిలో జరిగిన అల్లర్లలో నిందితుడు సైతం ఈ పుష్ప సిగ్నేచర్ మూవీని చేసి కెమెరాకు చూపించాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది. హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జహంగీర్ పురిలో తాజాగా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో కొందరు వ్యక్తులు బహిరంగంగా కాల్పులు జరిపారు.

తాజాగా కెమెరా విజువల్స్ సీసీటీవీ ఆధారంగా పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ప్రధాన నిందితుడైన అన్సార్ ను కోర్టుకు వెళుతుండగా మీడియా ఎదుట 'పుష్ప' సిగ్నేచర్ మూవ్ మెంట్ ను చేయడం వైరల్ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

కోర్టుకు తీసుకెళుతుండగా ప్రధాన నిందితుడు అన్సార్ మీడియాకుచూపిస్తూ 'తగ్గేదేలే' అంటూ ముందుకు సాగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పుష్ప మేనియాను క్రిమినల్స్ కూడా ఇలా వాడుకుంటున్నారని నెటిజన్లు కామెంట్ చేశారు. అన్సార్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.

Scroll to Top