జిన్ పింగ్ కు బ్రెయిన్ కేన్సరా? చైనా దాస్తోందా?

BY T20,

అమెరికాను ఢీ అంటే ఢీ అంటూ విస్తరణ వాదంతో పక్క దేశాలపై దండెత్తుతున్న చైనాకు అసలు సిసలు బలమే అధ్యక్షుడు జిన్ పింగ్. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ విస్తరణ వాదమే ఆ దేశాన్ని ప్రపంచంలో విలన్ గా చేస్తోందన్న వాదన ఉంది. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న భారత్ తో సరిహద్దు వివాదం పెట్టుకొని మన దూరమైపోయింది.

ఇక పాకిస్తాన్ లో వేలు పెట్టి అక్కడి ఒక వర్గం నుంచి బాంబు దాడులకు గురవుతోంది. ఇక పక్కనే ఉన్న తైవాన్ దేశాన్ని ఆక్రమించుకునేందుకు తహతహలాడుతోంది. ఉత్తరకొరియాకు బాంబులు సరఫరా చేస్తూ దక్షిణ కొరియా జపాన్ ను భయపెడుతోంది. ఇలా అంతటికీ ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ యే కారణమన్న వాదన ఉంది.

అలాంటి చైనా అధ్యక్షుడు 2019 తర్వాత ఒక్క పర్యటన పెట్టుకోలేదు. కారణం ఏంటి? ఎందుకు విదేశాలకు వెళ్లడం లేదు.? వెళ్లిన అస్వస్థతకు గురవుతున్నారు ఎందుకు అన్న దానిపై తాజాగా చైనా ఆలస్యం సమాధానం ఇచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సెరెబ్రల్ అన్యూరిజమ్ (మెదడులోని రక్తనాళంలో బెలూన్ ఏర్పడడం)తో  బాధపడుతున్నారని.. ఈ సమస్యతోనే 2021 డిసెంబర్ లో ఆస్పత్రిలో  ఆయన చేరాల్సి వచ్చిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్స చేయించుకోకుండా సంప్రదాయ చైనా వైద్యంలోనే చికిత్స పొందడానికి ఆయన మొగ్గుచూపుతున్నారని సమాచారం. నిజానికి దీన్ని వైద్య పరిభాషలో బ్రెయిన్ క్యాన్సర్ అని కూడా అంటుంటారు. కానీ సెరెబ్రల్ అన్యూరిజమ్ అని అధికారికంగా వ్యవహరిస్తారు.

2019 చివరలోనే కరోనా విజృంభించినప్పటి నుంచి షీ జిన్ పింగ్ విదేశీ నేతలను ఎవరినీ కలవడం లేదు. అందుకు అనారోగ్యమే కారణమని చెబుతున్నారు. 2019 మార్చిలో ఇటలీ ఆ తర్వాత ఫ్రాన్స్ పర్యటన సమయంలోనూ ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సమాచారం.

షీ జిన్ పింగ్ అనారోగ్యం కారణంగానే చైనా ఇప్పుడు ఏ దేశంపై దండెత్తడం లేదని.. ఆయన సరిగ్గా లేకపోవడంతోనే కాస్త సైలెంట్ గా ఉందని సమాచారం.

Scroll to Top