KGF3: కేజీఎఫ్3 ఎలా ఉండబోతుంది?.. స్టోరీ ఇదేనా?

BY T20,

KGF3: అమ్మకిచ్చిన మాట రాఖీ నిలబెట్టుకుంటాడా.. నర్స్ అన్నట్టు వందేళ్లు రాఖీ బ్రతుకుతాడా.. బంగారు గనుల కింగ్ లా దునియాను ఏలేస్తాడా.. ఇప్పుడివే ప్రశ్నలు కేజీఎఫ్ ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి.

చాప్టర్ 3 ఉంటుందనే హింట్ దొరికినప్పటి నుంచి ఎవరికి వాళ్లు స్టోరీ అల్లేసుకుంటున్నారు. మరి నిజంగానే కేజీఎఫ్ చాప్టర్ 3 ఉండబోతుందా.. ఉంటే కథలో ఏ ట్విస్ట్ రాబోతుంది..?

కేజీఎఫ్3 ఉంటుందా అంటే ప్రశాంత్ నీల్ ఇలా సింపుల్ గా నవ్వేసి తప్పించుకుంటున్నాడు కానీ హోంబలే ప్రొడ్యూసర్స్ మాత్రం కన్ఫర్మ్ మెసేజ్ లు ఇన్ డైరెక్ట్ గా పాస్ చేస్తున్నారు. ఇప్పటికే హోంబలే టీమ్ ప్రీప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసిందని కూడా చెప్తున్నారు. అన్నింటికి మించి చాప్టర్ 2 క్లైమాక్స్ కరెక్ట్ గా చూసినవాళ్లకు గూస్ బంప్స్ రావడం ఖాయం. అసలు రాఖీబాయ్ ను అమెరికన్, ఇండోనేషియన్ దళాలు ఎందుకు వెంటాడుతున్నాయనే ప్రశ్నతో పాటూ అమెరికా సిఐఏ అధికారి ఒకరు రైమికా సేన్ ను కలవడం.. మూడేళ్లలో రాఖీ చేసిన క్రైమ్ ఫైల్ ను ఆమెకు ఇవ్వడం.. అటు ప్రకాశ్ రాజ్ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ కేజీఎఫ్ చాప్టర్ 3కి సంబంధించిన ఫైల్ ను జరిపి చూడటంతో క్లైమాక్స్ ఒక్కసారిగా పీక్స్ కు చేరుకుంటుంది. ఇంతలోనే ది ఎండ్ కార్డ్ పడుతుంది.

కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటే స్టోరీ ఎలా ఉండబోతుందనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. ఉన్న బంగారన్నంతా పట్టుకుని రాఖీభాయ్ ఎక్కిన షిఫ్ ని మిసైల్ టార్గెట్ చేస్తోంది. కట్ చేస్తే ఎలాంటి రక్తపు మరకలు లేకుండా యశ్ బాడీ నీళ్లలో కనిపిస్తుంది. సో యశ్ బతికే ఉంటాడని ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చేసాడనే టాక్ నడుస్తోంది. ఇక సముద్రంలో గోల్డ్ దాచేసి సబ్ మెరైన్ లో రాఖీ ఎస్కేప్ అయిపోతాడనే గాసిప్ కూడా నడుస్తోంది. దానికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గ్యాంగ్ స్టర్ ఎస్కేప్స్ యూసింగ్ సబ్ మెరైన్ అన్న హెడ్ లైన్ తో ఉన్న ఈ పిక్ వైరలవుతోందిప్పుడు. ముఖ్యంగా కేజీఎఫ్ 2లో 1978 నుంచి 1981 వరకు ఏం చేసాడన్నది మనకు చూపించరు. ఈ గ్యాప్ లో విదేశాల్లో ఉన్న బంగారు గనులని ఆక్రమించుకుని.. అక్కడున్న భయంకరమైన విదేశీ క్రిమినల్స్ అంతమొందిస్తాడని.. అదే కేజీఎఫ్3లో చూపించబోతున్నారనేది మరో వెర్షన్.

ఇనయత్ ఖలీల్ క్యారెక్టర్ చేసిన బాలకృష్ణ కూడా చాప్టర్3 ఉన్నట్టా లేనట్టా చెప్పలేకపోతున్నాడు కానీ చాప్టర్ 2లో తక్కువగా కనిపించిన ఇనయత్ ఖలీల్ రోల్.. చాప్టర్ 3లో ఎక్స్ టెండ్ కానుందని అంటున్నారు. ఇక సముద్రం కింద చాలా బంగారముందని చెప్పిన అమ్మ మాట ప్రకారమే.. రాఖీ తన దగ్గరున్న బంగారాన్ని 20 వేల అడుగుల లోతైన సముద్రగర్భంలో పడేసాడని.. రైమికా సేన్ ను రాఖీ కలిసినప్పుడు యుద్ధాన్ని మొదలెడితే గెలిచేది రాఖీనే అని వార్నింగ్ ఇవ్వడం.. కేజీఎఫ్ చాప్టర్ 1, 2 సినిమాల్లో తనకెదురయ్యే ప్రతి సిచ్యుయేషన్ కు ఓ ప్లాన్ రెడీ చేసిన రాఖీ.. రైమికా సేన్ ఎత్తుకు ఓ పై ఎత్తు వేస్తాడని.. అది చాప్టర్ 3లో రివీల్ అవుతుందని.. ఇలా రకరకాల పార్ట్ 3పై హోప్స్ వినిపిస్తున్నాయి.

Scroll to Top