ఎక్కువ చేయకు..ముందు మేనర్స్ నేర్చుకో రాఖీభాయ్..?

BY T20,

సలామ్ రాఖీభాయ్..అబ్బా..బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ వస్తుంటే .. కన్నడ స్టార్ హీరో యాష్ స్టైల్ గా నడిచి వస్తుంటే..ఎలా ఉంటుంది.. అదేదో తెలియని ఫీలింగ్..

ఓ డాన్ వస్తున్నట్లు ..గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలో ఆయన స్టైల్ నే హైలెట్ అయ్యింది. ఆ గడ్డం..ఆయన షర్ట్ బటన్స్ విప్పేసి ఉండటం..ఆ వాకింగ్ స్టైల్ అబ్బో..యువత కు పిచ్చ పిచ్చగా నచ్చేసి యాష్ అంటే పిచ్చెక్కించే అభిమానం ఏర్పర్చుకుంది ఆ స్టైల్. అది అంతా సినిమా వరకే..అని ఇప్పుడు అర్ధం అవుతుంది. బయట అలాంటి స్టైల్..ఆ పొగరు ఉంటే కష్టం అంటూ నెటిజన్స్ యాష్ కు సజీషన్స్ ఇస్తున్నారు.

రీసెంట్ గా యాష్ హీరో గా నటించిన KGF 2 సినిమా రిలీజ్ అయ్యి..ఇండియన్ బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసింది. ప్రతి షాట్ ను ఓ సస్పెన్స్ లా..తీవ్ర ఉత్కంఠ భరితంగా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా చూశాక ఆయనకు జూనియర్ రాజమౌళి అని బిరుదు కూడా ఇచ్చేశారు. అంతలా అభిమానం సంపాదించుకున్నారు డైరెక్టర్. ఇక పేరుకి కన్నడ హీరో అయినా..తెలుగునాట కూడా యాష్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నారు. సినిమా లో ఆయన నటనకి స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు. ఓ రేంజ్ లో పొగిడేశారు.

కానీ, తాజాగా ఆయన బీహేవియర్ నచ్చక కొందరు తిట్టిపోస్తున్నారు. సినిమాలో ఆయన చెప్పిన వైలెన్స్ డైలాగ్ ను రీ క్రీయేట్ చేస్తూ.. మేనర్స్ ..మేనర్స్..మేనర్స్..మేనర్స్ నేర్చుకో రాఖీభాయ్…అంటు మండిపడుతున్నారు. ఇటీవల యాష్ తన భార్య రాధికా పండిట్‌..గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కలిశారు. ఫస్ట్ నుండి యాష్ కి గోవా అంటే ఇష్టమట. ఈ క్రమంలోనే అక్కడకు వెళ్లిన ఆయన సీఎం ప్రమోద్ సావంత్‌ను కలిశారు. మీటింగ్ బాగా జరిగింది. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. నవ్వుకున్నారు. ఫోటోలు దిగ్గారు. అంతా బాగానే ఉంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అక్కడే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ఆ ఫోటోల్లో యాష్ సీ ఎం ముందు షర్ట్ బటన్స్ తీసేసి.. ఓ పద్ధతి పాడు లేకుండా.. ఆయన ఇంకా రాఖీభాయ్ లానే ఫీల్ అవుతూ అదే స్టైల్ లో కూర్చున్నారు. దీంతో కొందరు నెటిజన్స్ యాష్ కు మర్యాదలు నేర్పిస్తున్నారు. సీ ఎం ముందు అలానే కూర్చునేది..ఆ మాత్రం తెలియదా.. ఫస్ట్ మేనర్స్ నేర్చుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

Scroll to Top