బాహుబలి కంటే కూడా ‘కేజీఎఫ్‌2’ ది గొప్ప విజయం

BY T20,

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్ లు కూడా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఇండియన్‌ సినీ ప్రేమికులకు కూడా నచ్చింది. బాహుబలి 2 అనేది ఒక సంచలనంగా నిలిచింది. 1800 కోట్ల వసూళ్లను రాబట్టిన బాహుబలి 2 రికార్డును రాబోయే పదేళ్ల వరకే కాదు ఆ తర్వాత కూడాబ్రేక్ చేయడం సాధ్యం కాదని అంతా భావించారు. ఇప్పుడు కేజీఎఫ్ దాదాపుగా ఆ రికార్డును చేరువ అయ్యింది. 

చాలా ఏరియాలో బాహుబలి 2 రికార్డును తూడ్చి పెట్టిన కేజీఎఫ్ 2 బాహుబలి మెయిన్‌ రికార్డును కూడా బద్దలు కొట్టేందుకు సిద్దంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బాహుబలి సినిమా తో పోల్చితే కేజీఎఫ్ 2 సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ కన్నడ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక సారి కాదు పది సార్లు చూసినా కూడా కేజీఎఫ్ 2 యొక్క కథ ఏంటీ అనేది ఎవరికి అర్థం కావడం లేదు అనేది ఒక విమర్శ కాగా.. కేవలం యాక్షన్ సన్నివేశాల వల్ల సినిమాను నడిపించారు అనేది మరో అభిప్రాయం.

కేవలం యాక్షన్ సన్నివేశాలతో కేజీఎఫ్ 2 ను సక్సెస్ చేసిన ఘనత ప్రశాంత్‌ నీల్‌ కు దక్కింది అంటున్నారు. ఇక 150 కోట్ల బడ్జెట్‌ తో ఏకంగా 1300 కోట్ల వసూళ్లను దక్కించుకున్న సినిమా గా ఈ సినిమా రికార్డు సాదించింది. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కూడా కేజీఎఫ్ 2 తర్వాతే అంటూ కన్నడ మీడియా వారు ప్రచారం చేస్తున్నారు. బాహుబలి 2 సినిమా బడ్జెట్‌ కు వచ్చిన వసూళ్లను మరియు కేజీఎఫ్ 2 బడ్జెట్‌ మరియు వసూళ్లను పోల్చితే ఖచ్చితంగా బాహుబలి కంటే గొప్ప విజయాన్ని కేజీఎఫ్ దక్కించుకుందంటూ కన్నడ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Scroll to Top