న్యూస్ రీడర్ కి కిమ్ సర్ ప్రైజ్.. ఏకంగా బంగ్లా ఇచ్చేశాడు!

BY T20,

ఉత్తర కొరియా అధిపతి కిమ్ జోంగ్ గురించి అందరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఎప్పుడూ యుద్ధాలు అణు బాంబుల విన్యాసాలతో వార్తల్లో నిలిచే ఈయన.. ఓ సరికొత్త వార్తతో ప్రభంజనం సృష్టించాడు. ఆయనలో అసలు ఈ యాంగిల్ కూడా ఉందా అనే విధంగా ప్రవర్తించి అందరినీ షాక్ కు గురి చేశారు. అయితే ఆయన తీసుకున్న ఈ తాజా నిర్మయం... ఆయనను నమ్ముకున్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మెస్సేజ్ ఇచ్చేలా ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే అసలు ఆయన ఏం చేశాడు ఎందుకు అతడిని ఇంతలా మెచ్చుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కొరియా సంప్రదాయ వస్త్ర ధారణలో ప్రజల్లో దేశభక్తిని ఉప్పొంగించేలా వార్తలు చెప్పే ఆమె పేరు రీ చున్ హీ. అయితే భావోద్వేగ భరితంగా ఉండే స్వరంతో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా వార్తలు చదివిన అనుభవం ఆమెది.

అయితే ఆమె ఉత్తర కొరియా అధికారిక టీవీ ఛానల్ లో పని చేస్తోంది. అయితే ఒకప్పటి దేశాధినేత మరణం మొదలు.. ప్రస్తుత నియంత జరిపే అణుపరీక్షలు వరకు అన్నింటిని ప్రజలకు చేరవేసేది రీ చున్ హీ. అయితే ఈమె గురించి విదేశీయులకు కూడా తెలుసు. అయితే పింక్ లేడీగా పాశ్చాత్య దేశాల్లో పేరొందిన ఈమెకు కిమ్ సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా ఓ బంగ్లానే ఈమెకు బహుమతిగా అందజేశారు.

ప్యాంగ్యాంగ్ లో కొత్తగా నిర్మించిన రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్స్ లోని ఓ విలాస వంతమైన ఓ ఇంటిని రీ చున్ హీకి... కిమ్ జోంగ్ ఉన్ బహుమతిగా ఇచ్చారు. స్వయంగా ఆయనే ఆ ఇంటికి వెళ్లి రీ చున్ తో కలియ తిరిగారు. అంతే కాకుండా ఆమె మెట్లు ఎక్కి దిగే సమయంలో కిమ్.. ఆమె చేయి పట్టుకొని మరీ దగ్గరుండి నడిపించారు. కిమ్ తీరుతో ఆ దేశ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రీ చున్తో పాటు పార్టీ కోసం పని చేస్తున్న మరి కొందరికి కూడా కిమ్ విలాసవంతమైన ఇళ్లను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే 1970లలో ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ తాత అయిన కిమ్ ఇల్ సంగ్ నివాసం ఉన్న చోటే ఈ ఇళ్లును నిర్మించారు.

శుక్రవారం కిమ్ ఇల్ సంగ్ 110వ జయంతి నేపథ్యంలో రాజ భక్తి ప్రదర్శించిన వారందరినీ ఇలా సత్కరించి ఉత్తర కొరియాలోని ఉన్నత వర్గాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్నది కిమ్ ఆలోచనని నిపుణులు అంటున్నారు.https://www.facebook.com/v2.10/plugins/page.php?adapt_container_width=true&app_id=184607281565521&channel=https%3A%2F%2Fstaticxx.facebook.com%2Fx%2Fconnect%2Fxd_arbiter%2F%3Fversion%3D46%23cb%3Dfadff2b2214f3c%26domain%3Dwww.tupaki.com%26is_canvas%3Dfalse%26origin%3Dhttps%253A%252F%252Fwww.tupaki.com%252Ff378f6cbb394958%26relation%3Dparent.parent&container_width=665&height=140&hide_cover=false&href=https%3A%2F%2Fbusiness.facebook.com%2FTupakidotcom%2F&locale=en_US&sdk=joey&show_facepile=true&small_header=false&tabs=timeline

Scroll to Top