KRK ట్రైలర్: ఒకేసారి ఇద్దరి ప్రేమలో మునిగి తేలుతున్న యువకుడి కథ..!

BY T20,

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. స్టార్ హీరోయిన్లు నయన తార - సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం 'కాతు వాక్కుల రెండు కాదల్'. నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో ''కణ్మణీ రాంబో ఖతీజా'' అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు.

ఇప్పటివరకు KRK సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ ఆసక్తిని కలిగించాయి. 'టూ టూ టూ' సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ తాజాగా ఆవిష్కరించారు.

'ఖుషి' సినిమాలోని సీన్ తరహాలో ఓ గుడిలో దీపం ఆరిపోతుండగా.. సేతుపతి - సామ్ - నయన్ ముగ్గురూ చేతులు అడ్డుపెట్టడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. రాంబో తనని పెళ్లి చేసుకున్నాడని నయనతార చెప్తుండగా.. నాతో పడుకున్నాడు అని సమంత చెబుతోంది.

ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడిన హీరో.. ఇద్దరితో కలిసుండాలని ఆశపడుతున్నాడు. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి ఇరువురి వద్ద ప్రస్తావించగా.. సమంత - నయనతార అతని చెంప పగలగొట్టే సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది.

ఈ క్రమంలో ముగ్గురూ కలిసి ఒకే బైక్ మీద వెళ్లడం.. బస్ లో ప్రయాణించడం.. బీచ్ లో చెట్టాపట్టాలేసుకుని తిరగడం వంటివి ఫన్నీగా ఉన్నాయి. 'టైటానిక్' లో షిప్ మీద నిలబడే సీన్ మరియు 'బాహుబలి 2' లో బాణాలు వదిలే సన్నివేశాన్ని ముగ్గురి కాంబోలో రీక్రియేట్ చేయడం అలరిస్తోంది.

చివర్లో ఒకరు టీ మరొకరు కాఫీ తీసుకురాగా.. సేతుపతి రెండింటినీ కలుపుకొని కళ్ళకు అద్దుకొని తాగడం కామెడీగా ఉంది. ట్రైలర్ తోనే సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ అని చెప్పేసారు. కాకపోతే క్లైమాక్స్ కి కణ్మణీ - ఖతీజా ఇద్దర్లో మన రాంబో ఎవరిని ఎంచుకుంటాడనేదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం.

అగ్ర కథానాయికలు సామ్ - నయన్ ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా.. అలానే విడాకుల ప్రకటన తర్వాత సమంత నటించిన పూర్తి స్థాయి సినిమా అని చెప్పవచ్చు. రౌడీ పిక్చర్స్ సహకారంతో 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు.

'కణ్మణి రాంబో ఖతీజా' (KRK) చిత్రాన్ని ఏప్రిల్ 28న తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే ఏప్రిల్ 29న 'ఆచార్య' సినిమా థియేటర్లలోకి వస్తోంది. మెగా మూవీని తట్టుకుని తమిళ డబ్బింగ్ సినిమా ఏమేరకు వసూళ్ళు రాబడుతుందో చూడాలి.

Scroll to Top