Police: లేడీ సింగం.. కాబోయే భర్తను అరెస్టు చేసిన మహిళా పోలీసు.. కారణం ఏంటంటే..

BY T20,

ప్రస్తుత సమాజంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. కొంత మంచి కేటుగాళ్లు దీన్ని ఆసరాగా చేసుకుని విద్యార్థులను, నిరుద్యోగులను (Unemployment) ఉద్యోగం ఆశచూపించి అందినకాడికి దోచుకుంటున్నారు.

ఇక విద్యార్థులు కూడా.. సరైన ఉద్యోగం దొరక్క ఎవరైన ఉద్యోగాలు ఇప్పిస్తామంటే.. వారి మాటలను నమ్ముతున్నారు. అడిగినంత సొమ్మును ఇచ్చుకుంటున్నారు. ఆ తర్వాత.. వారిచేతిలో మోసాలకు గురౌతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వార్తలలో నిలుస్తున్నాయి. మోసగాళ్లు, రైల్వేలు, (Railway jobs) పోలీసుల శాఖలు (Police department).. ఇలా ప్రభుత్వ కార్యలయాలలో తమకు తెలిసిన వారు ఉన్నారంటూ... నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఈ ఘటన అస్సాంలో (Assam) జరిగింది. రాణా పోగాగ్ (Rana Pogag) అనే వ్యక్తి తాను స్థానికంగా పబ్లిక్ రిలేషన్ (Public relation officer) అధికారినంటూ అక్కడి అధికారులతో, స్థానికులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతనికి మజులి జిల్లాలో (SI in Majuli district) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జున్మోని రాభా (Junmoni Rabha) తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరు పెద్దల అంగీకారంతో గత ఏడాది అక్టోబరులో ఎంగెజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకోనున్నారు.

ఈ క్రమంలో కాబోయే భర్త గురించి పలు షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చాయి. కొంత మంది వ్యక్తులు రాణా పోగాగ్ చేస్తున్న మోసాలకు గురించి ఆమెకు ఫిర్యాదు చేశారు. రాణాపోగాగ్ స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారని ఆమె ఎదుట వాపోయారు. సదరు వ్యక్తి తనకు.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) (ONGC) లో తెలిసిన వారు ఉన్నారని చెప్పి.. కోట్ల రూపాయలు తీసుకొని, నకిలీ నియామక పత్రాలు (Fake Offer letters) ఇచ్చారని ఆరోపించారు. దీంతో ఆమెకు కాబోయే భర్త బాగోతాలు వెలుగులోనికి వచ్చాయి.

దీంతో ఆమె షాకింగ్ కు గురైంది. వెంటనే అతగాడిని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. కాగా, ఫిర్యాదు చేసిన వారికి ఆమె ధన్యవాాదాాలు కూడా తెలిపారు. తనకు కాబోయే భర్త విషయాలు బాగోతాలు చెప్పిన వ్యక్తులకు, తన జీవితాన్ని కాపాడారని ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జున్మోని రాభా ఎస్సై (Assam cop) గతంలో.. స్థానిక బిహ్‌పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్ పై ఫైర్ అయి అప్పట్లో వార్తలలో నిలిచారు. ఒక కేసు విషయంలో.. ఎమ్మెల్యే అధికారినికి కాల్ చేశారు. దీంతో ఆమె ప్రజాప్రతినిధిగా ఉంటూ నిబంధనలను ఉల్లంఘించమని పోలీసులను ఎలా అడుగుతారని ఎమ్మెల్యేను జున్మోని రాభా ప్రశ్నించారు.

Scroll to Top