అరచేతిలో చిప్ తో సరికొత్త టెక్నాలజీ.. కార్డు లేకుండానే పేమెంట్!

BY T20,

ఒక్పుడు ఏదానా కొన్నప్పుడు నేరుగా వారి చేతుకు డబ్బులు ఇచ్చే వాళ్లం. ఆ తర్వాత కార్డులు ఉపయోగించాం. ఆ తర్వాత మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నుంచే డబ్బులు కట్టేస్తున్నాం. అయితే వీటన్నిటికంటే భిన్నంగా సరికొత్త టెక్నాలజీ మన ముందుకు రాబోతుంది. మనం ఏదైనా షాపుకు వెళ్లినప్పుడు వెంట డబ్బులు కార్డులు... ఆఖరికి మొబైల్ ఫోన్లు కూడా తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు.

మరెలా పేమెంట్ చేయాలి అనుకుంటున్నారా... ఏం లేదండి అలా మన చేతిని చాస్తే చాలు డబ్బులు అవే కట్ అవుతాయి. ఏంటీ.. చేతి చాస్తేనే డబ్బులు కట్ అవుతాయా అనుకుంటున్నారు కదా. అవునండి నిజమే. అలాగే కట్ అవుతాయి. బ్రిటీష్ కి చెందిన పాలిష్ స్టార్టప్ వాలెట్ మోర్ కంపెనీ ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. బాడీలో అమర్చే పేమెంట్ చిప్ లను ఈ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

ఇలాంటి చిప్ లను అందుబాటులోకి తెచ్చిన తొలి కంపెనీ కూడా ఇదే. అయితే ఇప్పటి వరకు 500కి పైగా పేమెంట్ చిప్ లను విక్రయించింది. ఈ చిప్ ల సాయంతో దుకాణాలు మాల్స్ ఆసుపత్రుల్లో.. డెబిట్ క్రెడిట్ కార్డులతో పాటు క్యాష్ అవరం లేకుండానే పేమెంట్లు చేసుకోవచ్చు. కానీ దీని కోసం యూజర్లు తమ చేతిపై కాంటాక్ట్ లేస్ పేమెంట్ మెషిన్ వద్ద ఉంచితే చాలు.

కాంటాక్ట్ లెస్ పేమెంట్ మెషిన్ వద్ద చేయి ఉంచితే... మనీ మీ బ్యాంకు అకౌంట్ నుంచి దుకాణదారుని అకౌంట్ కి వెళ్తాయి. ఈ పేమెంట్ విధఆనం పూర్తిగా సురక్షితమైందని అవసరమైన అన్ని అథారిటీల నుంచి ఈ చిప్ పేమెంట్ల కోసం ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది. వాలెట్ మోర్ చెప్పిన వివరాల ప్రకారం.... నియర్ పీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై ఈ చిప్ పని చేస్తుంది. ఇదే టెక్నిక్ ను స్మార్ట్ ఫోన్ల ద్వారా జరిపే కాంటాక్ట్ లెస్ పేమెంట్లకు కూడా వాడుతున్నారు.

ఒక గ్రాము బరువు ఉండే ఈ చిప్.. బియ్యపు గింజ కంటే కాస్త పెద్దదిగా ఉంటుందట. ఇంజెక్షన్ ద్వారా ఈ చిప్ ను బాడీలోకి పంపుతారు. దీన్ని అమర్చిన చోటే స్థిరంగా ఉంటుంది. దీని వల్ల లాంటి ప్రమాదం ఉండదు. 2021లో 4 వేల మంది యూరోపియన్ యూనియన్ యూకే ప్రజలపై జరిపిన సర్వేలో 51 శాతం మంది బాడీలో అమర్చే ఈ టెక్నాలజీపై కచ్చితంగా ఆలోచిస్తామని చెప్పారుట. ఈ చిప్ వల్ల పనులు సులభం అవుతాయనని చెప్తే... చిప్ సెక్యూరిటీపై కాస్త అనుమానం ఉందని చెప్పినట్లు ఓ సర్వే గుర్తించింది.

Scroll to Top