Mahesh Babu : మహేష్‌తో సినిమా చేస్తే సన్నబడాల్సిందే..

BY T20,

మహేష్ బాబు వరుస హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. యువ డైరెక్టర్స్ కి ఛాన్సులు ఇచ్చి సినిమా మీద సినిమా హిట్ కొడుతున్నాడు.

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో మే 12న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. అయితే మహేష్, అతని డైరెక్టర్స్ మీద ఇప్పుడు ఓ కొత్త విషయం వైరల్ అవుతుంది. మహేష్ తో పని చేసిన డైరెక్టర్స్ సినిమా ముందు లావు ఉంటే సినిమా తర్వాత సన్నబడిపోతున్నారంట.

సాధారణంగానే మహేష్ హెల్త్, బాడీ మీద చాలా కాన్సంట్రేట్ చేస్తాడు. ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తాడు. ఫుడ్ కూడా స్పెషల్ గా తీసుకుంటాడు. బయటి ఫుడ్ మహేష్ అస్సలు తినడు. రోజూ జిమ్ చేస్తాడు. అందుకే మహేష్ అంత ఫిట్ గా, అందంగా ఉంటాడు. అయితే మహేష్ తో సినిమా చేసేటప్పుడు అతని డైరెక్టర్స్ ని కూడా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తాడట. అతని డైరెక్టర్స్ ని వ్యాయామం చేయమని, తాను తినే స్పెషల్ హెల్తి ఫుడ్ వారితో తినిపించి వారిని కూడా హెల్తిగా, ఫిట్ గా చేస్తాడట.

గతంలో సరిలేరు నీకెవ్వరు సినిమా టైంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ మహేష్ కి స్పెషల్ కుక్ ఉంటాడు, ఆయనతో షూట్ ఉంటే ఆ ఫుడ్ మాకు కూడా పెడతారు అని చెప్పాడు. ఇక మహర్షి సినిమాకి ముందు వంశీ పైడిపల్లి చాలా లావుగా ఉండేవాడు. మహర్షి సినిమా తర్వాత వంశీ సన్నగా మారిపోయాడు. అంతే కాక మహేష్ కి వంశీ బెస్ట్ ఫ్రెండ్ కూడా కావడంతో ఇప్పుడు మరింత ఫిట్ గా మారాడు. ఇక సర్కారు వారి పాట సినిమాకి ముందు డైరెక్టర్ పరుశురాం కూడా లావుగా ఉండేవారు. ఇప్పుడు చూస్తే పరశురామ్ చాలా సన్నగా అయిపోయాడు. దీంతో మహేష్ తో పని చేస్తే సినిమా చేయడమే కాదు హెల్త్, ఫిట్ నెస్ కూడా బోనస్ అంటున్నారు నెటిజన్లు. దీనిపై సరదాగా డైరెక్టర్స్ మహేష్ సినిమా ముందు, తర్వాత అంటూ మీమ్స్ వేస్తున్నారు.

Scroll to Top