“మేజర్” కి బ్యాక్ బోన్ మహేష్..శేష్ ఎమోషనల్.!

BY T20,

తాజాగా పాన్ ఇండియా సినిమా దగ్గర ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన సినిమా “మేజర్” కూడా ఒకటి. యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే ట్రైలర్ ని మొత్తం మూడు భాషల్లో రిలీజ్ చెయ్యగా అన్ని భాషల్లో కూడా మంచి స్పందన వచ్చింది.

అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబుపై అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం జరిగింది. అసలు ఈ చిత్రానికి బ్యాక్ బోన్ మీరే అని ఈ సినిమా కోసం మీ ఫీలింగ్ ఇపుడు ప్రపంచానికి తెలిసింది. నిన్న రాత్రి ఫోన్ లో మీరు నాతో మాట్లాడిన ప్రతి మాట నా కళ్ళ నుంచి తెప్పించింది ఆ మాటలతో నా హృదయం నిండిపోయింది అని ఎమోషనల్ గా మహేష్ కి స్పెషల్ థాంక్స్ ఈ సినిమా విషయంలో అడివి శేష్ తెలియజేసాడు.

Scroll to Top