ఏళ్ల వ్యవధిలో లక్షాధికారులను చేసే మహోగని పెంపకం

BY T20,

ప్రస్తుతం రైతులు.. టేకు గంధం, మహోగని వంటి చెట్లను సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. మహోగని సతత హరిత చెట్టుగా పరిగణిస్తారు. ఇది 200 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.

దీని కలప ఎరుపు, గోధుమ రంగులో ఉంటుంది. ఇది నీటి నిలువకు పాడైపోదు. బలమైన గాలులు తక్కువగా ఉన్న ప్రదేశంలో దీనిని నాటాల్సివుంటుంది. మహోగని చెట్టు చెక్క ధర మార్కెట్‌లో అధికంగా ఉంటుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చెక్కను చెదలు కూడా పాడుచేయవు. ఇది ఇంత మన్నికైన చెక్క అయినందున ఓడలు, ఫర్నిచర్, ప్లైవుడ్, రకరకాల శిల్పాల తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల ఈ చెట్టు దగ్గరికి దోమలు, కీటకాలు రావు.

దీని ఆకులు, గింజల నూనెను దోమల నివారణ, క్రిమిసంహారకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దానితోపాటు ఈ చెక్కను సబ్బులు, పెయింట్, వార్నిష్, అనేక రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు. దీని ఆకులు క్యాన్సర్, రక్తపోటు, ఉబ్బసం, జలుబు మరియు మధుమేహం వంటి అనేక వ్యాధుల నివారణకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. మహోగని చెట్లు 12 సంవత్సరాలలో కలపను అందిస్తాయి. అప్పుడు రైతు ఈ చెట్టు చెక్కను విక్రయించవచ్చు. ఈ చెట్లను పెంచడం ద్వారా రైతులు కొన్నేళ్ల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారుతారు.

Scroll to Top