Manchu Vishnu : ఇండస్ట్రీ పెద్ద ఆయన ఒక్కడే.. మంచు విష్ణు సంచలన ట్వీట్..

BY T20,

Manchu Vishnu : టాలీవుడ్ హీరో.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇపుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు దర్శక రత్న దివంగత దాసరి నారాయణ రావు జయంతి.

ఈ రోజు దర్శకుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణ రావును ఎవరు రీప్లేస్ చేయలేరు అంటూ ఇండస్ట్రీ పెద్దగా అప్పటికీ ఎప్పటికీ దాసరి నారాయణ రావు గారే ఉంటారు అంటూ ట్వీట్ చేసారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా మంచు విష్ణుపై విరుచుకుపడుతున్నారు. దాసరి నారాయణ రావు మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దను కోల్పోయింది. ఆ స్థానంలో చిరంజీవి టాలీవుడ్ పెద్దగా ఇండస్ట్రీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.

మరోవైపు చిరంజీవి కూడా నేను ఇండస్ట్రీని పెద్దను కాదు.. ఇండస్ట్రీ బిడ్డను. ఓ బిడ్డగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు సాయం చేస్తున్నట్టు ప్రకటించుకున్నారు. ఇందులో ఎవరు పెద్ద, చిన్నా అనే తేడా లేదు అంటూ తన హుందాతనం చాటుకున్నారు. ఇక మంచు విష్ణు ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఇక దాసరి నారాయణ రావు విషయానికొస్తే.. ఆయనలా ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించడం ఎవరి వల్ల కాదనేది జగమెరిగిన సత్యం. సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యవహారాలతో పాటు క్యాటరింగ్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కబెట్టిన ఘనత గురువుగారైన దాసరికి దక్కుతుందని ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏమైనా తెలుగు సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావుకు సరిలేరు నీకెవ్వరు. పైగా ఆయన వెళ్లిన తర్వాత ఎవరో ఒకరు ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిందే. చిరంజీవి ఆ స్థానాన్ని భర్తీ చేయకపోయినా.. ఉన్నంతలో ఇండస్ట్రీ తరుపున ఆ తన వంతుగా అందరికీ సాయం చేస్తున్నారు. రీసెంట్‌గా మంచు విష్ణు ఆచార్య సినిమాకు నెగిటివ్ టాక్ సందర్భంగా చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ చిరంజీవిని ఉద్దేశించి చేసిందనే టాక్ వినబడింది. ఏమైనా ఒక హీరోలకు హిట్ ఫ్లాపులనేవి చాలా కామన్. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే హీరోల పని.

Scroll to Top