‘మైఖేల్’ లుక్ అదిరింది..

BY T20,

వరుస ప్లాపులతో సతమవుతున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన కొత్త చిత్రం 'మైఖేల్'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైయ్యాడు.

శనివారం సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొద్దిసేపటిక్రితం మేకర్స్ సోషల్ మీడయా ద్వారా విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రంజిత్ జేయకొడి దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, దర్శకుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై సందీప్ కిషన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం సందీప్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Scroll to Top