మిలటరీ హోటల్స్ అంటే ఏమిటి ? మిలటరీ వాళ్ళు ఓనర్ గ ఉంటారా ?

BY T20,

అసలు మిలటరీ హోటల్స్ అంటే ఏమిటి ? అక్కడ మిలటరీ వంటలు ఉంటాయా? . లేక, మిలటరీ లో వంటలు వండిన వాళ్ళు వంటలు చేస్తారా ? . ఐతే మిలటరీ హోటల్ అంటే మిలటరీ కి, మిలటరీ లో పని చేసిన వాళ్ళకి ఏమి సంబంధం లేదు. మాంసాహార హోటల్ అని వ్రాయడం కన్న, మిలటరీ హోటల్ అని వ్రాస్తే బాగుంటుందని.. కొంచెం లెవెల్ పెంచడానికి.. మిలిటరీ హోటల్ అని రాస్తారు. అంతే కాకుండా శాఖాహారం తినే వారికి కూడా తెలిసిపోతుంది కదా… ఇది మాంసాహార భోజనశాల అని. 
అంతే కాకుండా మిలటరీ (సైన్యం ) లో వారికి శరీర దారుఢ్యానికి మాంసాహారం ఆహారముగా ఇవ్వడము మొదట నుండి ఉంది. తప్పని సరిగా అందరూ తినాలి. అందుచే మిలటరీ కి మాంసాహారానికి లింక్ ఉంది. మాంసాహార భోజనం అనకుండా మిలటరీ హోటల్ అని పిలవడం అలవాటుగా మారింది.

మాంసాహారం తినే వాళ్ళు మిలిటరీలో పనిచేసే సైనికుల్లాగా బలంగా తయారు అవుతారని మాంసాహార హోటల్ బదులు మిలటరీ హోటల్ అని రాస్తారు. మిలటరీ హోటల్ పేర్లు ఎక్కువగా కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కన్పిస్తాయి. బోర్డర్ లో సైనికులుగా పనిచేసిన వాళ్ళని మిలిటరీ లో పని చేసారు అని చెప్తారు.

Scroll to Top