భర్త మరణంలోనూ ధర్మం మాట్లాడిన పతివ్రత మండోదరి.. రావణుడి మరణం గురించి ఏమన్నదంటే

BY T20,

రామాయణ, మహాభారతాలు(Mahabharata) హిందూ పురాణాల్లో(Hindu Mythology) మహా కావ్యాలు కీర్తించబడుతున్నాయి. వీటిని హిందువులు ఇతిహాసాహసాలుగా మాత్రమే చూడరు..

జీవిత సారాన్ని తెలిపే గ్రంథాలుగా భావిస్తారు. ఈ రెండు గ్రంథాల్లోనూ కనిపించే పాత్రల విశిష్టతను.. తరచిచూస్తే.. మనిషి దైనందిన జీవితంలో దర్శనమిస్తాయని పెద్దలు చెబుతుంటారు. అందుకనే రామాయణం, మహాభారతం జరిగిపోయి ఇన్ని కాలాలు గడుస్తున్నానేటికీ మనం వాటిని స్మరిస్తున్నాం.. ఆ పురాణాల్లోని పాత్రల విశిష్టతను గుర్తు చేసుకుంటున్నాం.. రామాయణంలో రావణుడి భార్య మండోదరి… మహా పతివ్రతగా ఖ్యాతిగాంచింది. నేటికీ కీర్తించబడుతోంది. తన భర్త రావణుడు మరణించిన అనంతరం.. మృత దేహం వద్ద విలపిస్తూ.. భర్త మరణానికి కారణం రాముడు కాదు నీ ఇంద్రియాలేనిన్నుకాటేశాయి అంటూ ధర్మం మాట్లాడిన మహాసాధ్విమని మండోదరి గురించి తెలుసుకుందాం..

రావణబ్రహ్మ భార్య మండోదరి మహా పతివ్రత. దేవ శిల్పి విశ్వకర్మ పుత్రుడైన మయ బ్రహ్మ కుమార్తె. మయబ్రహ్మ, దేవ కన్య హేమ లకు మండోదరి జన్మించింది. మండోదరి అందాన్ని చూసి.. రావణాసురుడు మోహించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇంద్రజిత్తు జన్మించాడు. మండోదరి తన తండ్రితో కలిసి వనంలో విహరిస్తున్న సమయంలో మండోదరి సౌదర్యాన్ని చూసి.. రావణుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయమని మయుడిని అడుగుతాడు. అలా వీరిద్దరికి వివాహం జరిగింది. సీతాదేవిని రావణుడు అపహరించిన అప్పటి నుండి రావణుడికి కీడు జరుగుతుందని మండోదరి భావించేంది.. తన భర్తకు ధర్మం, అధర్మం గురించి చెబుతూ.. సీతాదేవిని చెరనుంచి విముక్తి చేయమని భోధిస్తుండేది. అయితే రావణాసుడు ఎవరి మాటలకూ వినకపోవడంతో.. రాముడు చేతిలో రావణుడు మరణించాడు. భర్త అనంతరం యుద్ధభూమికి మండోదరి వస్తుంది. రావణుడి శరీరానికి కొద్ది దూరంలో రామలక్ష్మణులు పక్కన విభీషణుడు నిలబడి ఉంటారు. ఎవరికైనా సరే తన భర్తను చంపారు అంటే ఎంతో కోపం వస్తుంది. అయితే మండోదరికి మాత్రం చంపిన వాళ్లపై కోపం రాలేదు. పైగా ఆమె ఎవరు నిన్ను చంపారు అంటూ మండిపడలేదు.

యుద్ధ భూమికి వెళ్లిన మండోదరి పల్లకి దిగి రావణుని శవం దగ్గరికి ఏడుస్తూ వెళ్ళిన మండోదరి “వీళ్ళందరికీ తెలియని విషయం ఏమిటంటే.. నిన్ను రాముడు చంపారని అందరూ అనుకుంటున్నారు. కానీ నీచావుకు కారణం రాముడు కాదు.. నీ ఇంద్రియాల నిగ్రహణ కోల్పోవడమే.. నీవు తపస్సు చేసుకునే సమయంలో నీ ఇంద్రియాలను అన్నిటిని అదుపులో ఉంచుకున్నావు. కోరికలను జయించావు. అయితే సీతమ్మను చూసాక నీ ఇంద్రియాలు అదుపుతప్పాయి. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనబడిందో..? ఆ సమయంలో నీవు నీ ఇంద్రియాలను, కోరికలను అదుపులో ఉంచకపోవడం, మంచి చేడుల విచక్షణ కోల్పోవడం వలన నేడు నీకు ఈ విధంగా మరణం సంభవించింది. నిన్ను చంపింది రాముడు కాదు.. నీ ఇంద్రియాలే నిన్ను కాటేశాయి.." అంటూ వాపోయింది. ఏ స్త్రీ అయినా భర్త హత్య చేయబడితే.. తన ఆవేదనను, ఆక్రోశాన్ని తన భర్త చావుకు కారణమైనవారిపై ఆగ్రహాన్ని వెల్లడిస్తుంది. అయితే ధర్మం తెలిసిన మండోదరి.. భర్త మరణించినా కూడా ధర్మమే మాట్లాడింది. అందుకనే మహా పతివ్రతగా కీర్తించబడుతోంది.

Scroll to Top