రెండో టైమ్ జోన్ ఏంటి.. ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు కావాలనుకుంటున్నారు?

BY T20,

మన దేశంలో ఒక్కో చోట ఒక్కో సమయంలో సూర్యోదయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉదయం 5.30 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు. అదే హైదరాబాద్ లో అయితే ఉదయం 6 గంటలకు కాస్త అటూ ఇటూగా సూర్యోదయం జరుగుతుంది. విశాఖపట్నం హైదరాబాద్ ల మధ్య సూర్యోదయం మధ్య తేడా పావు గంట నుండి అర్థ గంట వరకు ఉంటుంది. మరి భారత్ లోని తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య సూర్యోదయ సూర్యాస్తమ సమయాల మధ్య ఎంత తేడా ఉంటుందో తెలుసా..

ఈశాన్యాన ఉండే అరుణాచల్ ప్రదేశ్ రాష్టంలోని లోహిత్ జిల్లా డాంగ్ లో భారత దేశంలోనే తొలిసారిగా సూర్యుడు ఉదయిస్తాడు. ఇక్కడ వేసవి కాలంలో ఉదయం 4 గంటలకే సూర్యోదయం జరుగుతుంది. అంటే 9 గంటలకు పాఠశాలలు ఆఫీసులు మొదలయ్యే సమయానికి ఇక్కడ పగటి వేల హైదరాబాద్ లో కాసింత ఎండ ఉంటుంది.

అరుణాచల్ ప్రదేశ్ లో సాయంత్రం 4.30గంటలకే సూర్డు అస్తమిస్తాడు. దీంతో పాఠశాలలు కార్యాలయాల్లో 5 గంటలకే లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చలి కాలంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. 4 గంటలకే ఇక్కడ సూర్యాస్తమయం జరుగుతుంది. దీంతో ఈశాన్య ప్రాంతాల్లోని రాష్ట్రాలు తమకు ప్రత్యేక టైమ్ జోన్ కావాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాయి.

తాజాగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ డిమాండ్ ను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఇటీవల మేఘాలయతో సరిహద్దు ఒప్పందానికి సంబంధించిన నివేదికను సమర్పిస్తూ అసెంబ్లీలో హిమంత మాట్లాడారు. కొత్త టైమ్ జోన్ భారత్ లోని ఇతర ప్రాంతాల కంటే 2 గంటలు ముందుకు  ఉంటే.. చాలా విద్యుత్ ఆదా అవుతుందని.. పని చేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని అన్నారు. దీని వల్ల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పారు. జీవ గడియారం తో  అనుసరించే టైమ్ కూడా కలుస్తుందని వెల్లడించారు.

సూర్యుడి వెలుగు ఎక్కువగా ఉండే సమయాన్ని కోల్పోవడం కరెంటు ఉపయోగం పెరగడం లాంటి కారణాలను చూపుతూ ప్రత్యేక టైమ్ జోన్ కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. స్వాతంత్ర్యానికి ముందు భారత్ లో బాంబే టైమ్ కలకత్తా టైమ్ పేరుతో రెండు టైమ్ జోన్లు ఉండేవి.

వీటితో తూర్పు పశ్చిమ ప్రాంతాలు మెరుగ్గా సూర్య రశ్మిని ఉపయోగించుకునేవి. ఫలితంగా విద్యుత్ కూడా ఆదా అయ్యేది. కానీ గందరగోళాన్ని తొలగించే చర్యల పేరుతో ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం 2 టైమ్ జోన్ల స్థానంలో ఇండియన్ స్టాండర్డ్ టైమ్ జోన్ ను తీసుకువచ్చింది.

Scroll to Top