నానీ ‘జెర్సీ’ సినిమాను డబ్ చేసి ఉండాల్సింది : రామ్ గోపాల్ వర్మ

BY T20,

నేచురల్ స్టా్ర్ నానీ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'జెర్సీ'. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

టాలీవుడ్ 'పర్ష్యూట్ ఆఫ్ హ్యాపీనెస్‌' గా పలువురు ప్రశంసించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని సైతం దక్కించుకుంది. ఇదే సినిమాను బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ తో రీమేక్ చేశారు ఒరిజినల్ వెర్షన్ మేకర్స్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ లో రీసెంట్‌గా విడుదలైంది. అయితే అక్కడ మాత్రం తెలుగు స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతోంది. షాహిద్ కపూర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ.. ఒరిజినల్ సోల్ మిస్ అయిందనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

'నానీ 'జెర్సీ' సినిమాను బాలీవుడ్ లో డబ్ చేసి ఉండుంటే.. నిర్మాతలకు 10 లక్షలు మాత్రమే ఖర్చయి ఉండేది. అలా కాదని దీన్ని హిందీలో రీమేక్ చేసినందుకు నిర్మాతలకు ఏకంగా రూ. 100 కోట్లు వరకూ నష్టం వచ్చింది. దీని వల్ల డబ్బు, సమయం, శ్రమ వృధా అయ్యాయి...' అని చెబుతూ.. డెత్ ఆఫ్ రీమేక్స్ అని హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశారు వర్మ. అలాగే.. మరో ట్వీట్ లో .. 'జెర్సీ' డిజాస్టర్ బాలీవుడ్ కు డెత్ ఆఫ్ రీమేక్స్ అనే సంకేతాన్ని అందిస్తోంది. 'కెజీఎఫ్, పుష్ప, ఆర్.ఆర్.ఆర్' లాంటి డబ్బింగ్ సినిమాలు బాలీవుడ్ ఒరిజినల్ సినిమాల్ని తలదన్నేలా సూపర్ హిట్టయ్యాయి. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయింది'... అంటూ ట్వీట్ చేశారు.

Scroll to Top