నారద మహర్షికి ఇల్లు లేకుండా లోక సంచారిగా ఎందుకు తిరుగుతుంటాడు … అలా అవడానికి ఎవరి శాపం కారణమో తెలుసా..?

BY T20,

నారదుడు బ్రహ్మ మానస పుత్రుడిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. కానీ ఇతనికి కలహానుడని, కలహప్రియుడని కూడా పేర్లున్నాయి. అయితే ఇతను పెట్టే కొట్లాటలు (కలహములన్నీ)అన్నీ ఎవరైతే గర్వంతో ఉంటారో..

వారి గర్వాన్ని అణచివేసి లోకకల్యాణమునకు దారితేసేవి. అదీకాక నారదుడు ఎప్పుడూ ఒక చోట ఉండలేడు. అటూ ఇటూ తిరుగుతూ.. లోక సంచారం చేసేవాడు. ఇంతకీ నారదుడు లోక సంచారి ఎలా అయ్యాడో మీకు తెలుసా..

నారాయణ.. నారాయణ.. అంటూ లోకాలన్నింటీ చుట్టీ ఇద్దరి మధ్యన కొట్లాటలు పెట్టి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటారు నారదముని. నారదుని గురించి.. అతని వాక్ చాతుర్యం గురించి తెలుగు సినిమాల్లో మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇంతకీ నారదుడు ఇద్దరి మధ్యన ఎందుకు కొట్లాటలు పెడతాడు. అతనికి ఇదేం సరదారాబు అనుకునే వారు చాలా మందే ఉంటారు. మనలో కూడా ఇలాంటి వారు ఉంటుంటారు. ఇద్దరి వ్యక్తుల మధ్య నారదుడు కలహాలు పెడతాడని అతనికి కలహప్రియుడని, కలహభోజనుడని, కలమానుడని పేర్లు కూడా ఉన్నాయి.

వాస్తవానికి నారదుడు పెట్టే కలహాలకు ఒక కారణం ఉంటుందని పురాణాలు తెలుపుతున్నాయి. అవును నారదుడు పెట్టే కలహాలన్నీ చివరకు లోకకల్యాణానికి దారిసేవిగానే ఉంటాయట. ఈ కలహాలను కూడా నారదుడు ఎవరైతే గర్వంతో ఉంటారో వారి గర్వాన్ని అణచివేయడానికే ఇలా కలహాలను పెట్టి లోకకల్యాణానికి పునాది వేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇతను ఎంతో మందికి మార్గ నిర్దేశనం కూడా చేశాడు. అయితే నారద మహాముని ఎందుకు లోక సంచారి అయ్యాడో తెలుసా.. పురాణాలు నారదుని గురించి ఏం చెబుతున్నాయో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

నారదుడు బ్రహ్మ మానస పుత్రుడుగా కీర్తించబడ్డాడు. దీనికి కారణం బలి చక్రవర్తిని అంతం చేయడానికి శ్రీ మహా విష్ణువు వామనావతారం ఎత్తి.. బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని ఇమ్మని అడుగుతారు. దానికి బలిచక్రవర్తి అంగీకరిస్తాడు. దాంతో వామనావతారంలో ఉన్న విష్ణువు ఒక అడుగు భూమి, ఇంకో అడుగు ఆకాశాన్ని, ఇంకో అడుగు బలిచక్రవర్తి తలపై వేస్తాడు. అయితే అప్పుడు శ్రీహరి పాదాన్ని కడగడానికి బ్రహ్మ తన శక్తి చేత ఒక పుత్రున్ని పుట్టిస్తాడు. అతన్ని నీళ్లను తీసుకురామని చెప్తాడు. తండ్రి మాట ప్రకారమే కొడుకు నీళ్లను తీసుకొచ్చి ఇస్తాడు. ఇలా జన్మించిన నారదుడు బ్రహ్మ మానస పుత్రుడుగా కీర్తించడడ్డాడు.

బ్రహ్మ సమక్షంలో నారదముని తన గాన నైపుణ్యాలను బయటపెడతాడు. దాంతో తండ్రి (బ్రహ్మ)ఎంతో సంతోషపడిపోయి హరిభక్తిని భోదిస్తాడు. అప్పటి నుంచి నారదుడు హరినామ సంకీర్తణను చెబుతూ లోక సంచారిగా మారిపోయాడు.

అయితే ఒకనాడు నారాయణ సరస్సు దగ్గర దక్ష ప్రజాపతి కుమారులు ప్రజా సృష్టి కోసం తపస్సు చేస్తుంటారు. ఆ సమయంలో నారదుడు వారి వద్దకు వెల్లి మీరు అశాశ్వతమైన సంసారాన్ని ఎందుకు కోరుకుంటున్నారు.. దీనికి బదులుగా మోక్షం ప్రసాదించమని కోరుకోవాలి అని వాళ్లకు చెబుతాడు. దాంతో వారి తప్పసుకు భంగం ఏర్పడింది. సృష్టికార్య విముఖలవ్వడంతో.. దక్షుడికి కోపం వచ్చింది. దాంతో నారాయణ మహామునిని ఇలా అన్నాడు.. నువ్వు నా కొడుకుల బద్దిని చలించేసినందున నీకు నిలకడ ఉండదు గాక. నీవు ఇద్దరి వ్యక్తుల మధ్య కొట్లాటలు పెట్టి కలహాశనుడవుదువు గాక అని శాపం పెట్టాడు.

అయితే కొట్లాటలు(కలహాలు) వల్ల మనశ్శాంతి కరువువుతుంది. అయితే నారదుడు పెట్టే కొట్లాటలు దుష్ణశిక్షణకు కారణమవుతాయి. అవి చివరకు లోకకల్యానికి దారితీస్తాయి. ఈ శాపం చేతనే నారదుడు ఎప్పుడు నిలకడగా ఒక చోట ఉండడు. అయితే కొట్లాటలు(కలహాలు) వల్ల మనశ్శాంతి కరువువుతుంది. అయితే నారదుడు పెట్టే కొట్లాటలు దుష్ణశిక్షణకు కారణమవుతాయి. అవి చివరకు లోకకల్యానికి దారితీస్తాయి. ఈ శాపం చేతనే నారదుడు ఎప్పుడు నిలకడగా ఒక చోట ఉండడు.

Scroll to Top