‘భాగమతి’ హిందీ రీమేక్ కు మొదలైన సన్నాహాలు
2019-11-30 18:15 IST

గత ఏడాది ఆరంభంలో అనుష్క ప్రధాన పాత్రలో విడుదలైన ‘భాగమతి’ చిత్రం భారీ విజయం అందుకుంది. ఈ సినిమా అనుష్క సినీ కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక చిత్రంగా నిలిచింది. అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి.
అయితే ‘భాగమతి’ హిందీ రీమేక్ లో అనుష్క పాత్రలో భూమి పెడ్నేకర్ ను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాను టి.సిరీస్ వారు అక్షయ్ కుమార్ తో కలిసి నిర్మిస్తున్నారు. దర్శకుడు అశోక్.. హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కథలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘దుర్గావతి’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.