ప్రజ్ఞా ఠాకూర్ పై మండిపడుతున్న విపక్షాలు… మధ్యప్రదేశ్ లో అడుగుపెడితే సజీవదహనం చేస్తామంటూ వ్యాఖ్యలు
2019-11-29 12:50 IST

బిజెపి ఫైర్ బ్రాండ్ నేత సాధ్వి ప్రజ్ఞా సింగ్ తాజాగా గాడ్సేను దేశ భక్తుడిగా కీర్తించారు. విషయంలోకి వస్తే, లోక్ సభలో బుధవారం నాడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) బిల్లుపై జరిపిన చర్చలలో గాడ్సేను కీర్తిస్తూ ఆయన దేశభక్తుడిగానే ప్రజల్లో మిగిలిపోరంటూ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు చేశారు. గాడ్సేను ఉగ్రవాదిగా పిలిచే వారికి ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు వివాదాలకి ఆజ్యం పోశాయి. ఈమె చేసిన వ్యాఖ్యలకు విపక్షాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సాధ్వి ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోవర్ధన్ మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ లో ప్రజ్ఞా ఠాకూర్ గనుక అడుగుపెడితే ఆమెను సజీవంగా తగలబెడతామంటూ విమర్శక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెను డిఫెన్స్ ప్యానల్ నుంచి తొలగించింది. అంతేకాకుండా, భోపాల్ లో కూడా నిన్న ఆమెపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు.