‘రూపీ… రూపీ’ సాంగ్ తో వచ్చిన ‘దొంగ’ కార్తి
2019-12-02 12:02 IST

ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో వచ్చిన ఖైదీ సినిమా తమిళ, తెలుగు భాషలలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్స్ కూడా ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో హీరో కార్తి కి దర్శకుడు లోకేష్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఒక సినిమాలో కామెడీ, సాంగ్స్, హీరోయిన్ వంటి కమర్షియల్ అంశాలు లేకుండా ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాదించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం కార్తి జీతు జోసెఫ్ దర్శకత్వంలో జ్యోతిక, కార్తి అక్కా తమ్ముళ్లగా ‘దొంగ’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపించే ఈ సినిమాలో సత్యరాజ్ కీలకపాత్ర పోషించనున్నారు. తమిళ చిత్రం ‘తంబీ’ ని తెలుగులో ‘దొంగ’ గా విడుదల చేస్తున్నారు.
తాజాగా, నేడు ఈ మూవీలోని రూపీ… రూపీ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కార్తీ ఒకపక్క దొంగ గా, మరోపక్క అక్కను కాపాడే మంచి తమ్ముడిగా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారు.