సోయి లేని స్థితిలో చేసాం…కానీ, ఇంత దూరం వస్తుందని అనుకోలేదు : వెటర్నరీ వైద్యురాలి కేసులో నిందితులు
2019-12-02 10:45 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలి హత్యాచారం కేసులో చిక్కిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసుల విచారణలో మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి. పోలీసుల ప్రశ్నలకు నిందితులు సమాధానమిస్తూ, ఆ సమయంలో తాము ఫుల్లుగా తాగి ఉన్నామని, ఏం చేస్తున్నామో కూడా సోయి లేదని అటువంటి స్థితిలోనే ఈ ఘాతుకానికి పూనుకున్నామని చెప్పి పోలీసులకు షాక్ ఇచ్చారు.
పొద్దున్నుంచి ఖాళీగా లారీలో కూర్చొని విసుగు పుట్టింది. ఇక అదే సమయంలో ఒంటరిగా యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం.. ఆమె ఎంత ఆలస్యంగా వస్తే తమ పని అంత సులభమవుతుందని అనుకుని ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత అక్కడ నుంచి పరార్ అవ్వాలని ముందుగానే నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆమెను చంపేసి కాల్చేస్తే ఎవరికి అనుమానం రాదని అలాగే ఇంత దూరం వస్తాదని తాము అనుకోలేదని వెల్లడించడంతో పోలీసులు ఖంగుతిన్నారు.