తెలంగాణ పల్లెటూరి కుర్రాడిలా చైతు… అరుదైన పాత్రల్లో చైతూ పాత్ర ఒకటిగా ఉంటుందట..!
2019-12-02 16:32 IST

సహజత్వానికి దగ్గరగా ఉంటూ.. అటు యూత్ ను, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించే సినిమాలు తీసే ఘనత శేఖర్ కమ్ములకు ఉంది. తనదైన రీతిలో ఆడియన్స్ ను థియేటర్లకి రప్పించ గల ప్రత్యేకత ఉన్న శేఖర్.. ఇప్పుడు తన తదుపరి సినిమాను పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నాడు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి నటిస్తుంది. రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో తెలంగాణ పల్లెటూరి కుర్రాడి పాత్రలో చైతూ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు ఇదే హైలెట్ గా నిలుస్తుందట.
ఈ సినిమాలో చైతు పాత్ర గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, మన తెలుగు సినీఇండస్ట్రీలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో వచ్చే హీరో పాత్రలు చాలా అరుదని.. అలాంటి అరుదైన పాత్రల్లో చైతూ చేస్తున్న పాత్ర కూడా ఒకటని పేర్కొన్నారు.
అలాగే, చైతుది ఈ సినిమాలో తెలంగాణ పల్లెటూరి కుర్రాడి పాత్ర కావడంతో తెలంగాణ యాసను కూడా చైతు నేర్చుకుంటున్నారట. అంతేకాకుండా, యాసపై పూర్తిగా పట్టు సాధించేలా కష్టపడుతున్నాడట. తమ కలల్ని నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చిన యువతీయువకుల కథగా ఈ సినిమా రూపొందుతుంది.