ఎన్టీఆర్‌30 : ‘ఆచార్య’ ఫ్లాప్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఆలోచన ఏంటో తెలుసా!

BY T20,

ఆర్ఆర్‌ఆర్ సినిమా ను ముగించుకున్న ఎన్టీఆర్‌ ఇప్పుడు తన 30వ సినిమాను కొరటాల శివ తో చేసేందుకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆచార్య సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్‌ 30 సినిమా పనులు మొదలు పెట్టాలని భావించాడు. ఇటీవల ఆచార్య సినిమా విడుదల అయ్యింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌ 30 సినిమా వర్క్ షురూ చేయాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు అందుకు సంబంధించిన హడావుడి కనిపించడం లేదు. కారణం ఆచార్య సినిమా అట్టర్‌ ప్లాప్‌.

ఔను ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్‌ 30 సినిమా యొక్క పనులపై ప్రభావం పడ్డట్లు అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

కాని ఆ సినిమా ప్లాప్‌ గా నిలవడంతో ఏం చేయాలో దర్శకుడు కొరటాల శివకు పాలు పోవడం లేదు. మెగా ఫ్యాన్స్ కొరటాల శివ పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ అభిమానులు ఈ సమయంలో ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్‌ 30 కి కూడా ఆచార్య టాక్‌ ఫలితం రిపీట్ అయితే పరిస్థితి ఏంటీ అంటూ వారు ఒకింత సందేహం తో ఉన్నారు.

ఈ సమయంలో ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివల మద్య చర్చలు జరిగాయని.. ఆచార్య సినిమా ప్లాప్‌ నేపథ్యంలో కొరటాలకు ఎన్టీఆర్‌ కాల్‌ చేసి ఓదార్చినట్లుగా మాట్లాడటంతో పాటు మన సినిమాతో సక్సెస్‌ కొడదాం అంటూ హామీ ఇచ్చాడట. నీ వెనుక నేను ఉన్నాను. ఇంకా కష్టపడి మన సినిమాతో సక్సెస్ కొడదాం శివ అంటూ ఎన్టీఆర్‌ వ్యాఖ్యలు చేశాడట. అయితే స్క్రిప్ట్‌ విషయంలో కాస్త మార్పులు చేర్పులు చేసే అవకాశాన్ని కూడా ఆయన పరిశీలించాలి అన్నాడట. జూన్ లో అనుకున్న సినిమా జులై కి వాయిదా పడే అవకాశం ఉంది. షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం అయినా వచ్చే ఏడాది సమ్మర్ లో ఎన్టీఆర్‌ 30 సినిమా విడుదల అవ్వడం ఖాయం. 

Scroll to Top