ప్రశాంత్ నీల్ ఫ్యామిలీతో మెరిసిన ఎన్టీఆర్.. మ్యాటరేంటో..?

BY T20,

కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న ఏకైక పేరు ప్రశాంత్ నీల్ ( Prashanthneel). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత అంతకంటే ఎక్కువగా క్రేజ్ ను సంపాదించుకున్న సినిమా కే జి ఎఫ్.

ఈ సినిమాను రూపొందించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) కు అలాగే ప్రశాంత్ నీల్ కు ఇద్దరికీ కలిపి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టు లు ఆఫర్ చేయడానికి దాదాపు సౌత్ ఇండస్ట్రీ మొత్తం కూడా రెడీగా ఉండడం గమనార్హం. గత కొన్ని రోజుల వరకు వీరు షెడ్యూల్ బాగా బిజీగా ఉండనున్నట్లు సమాచారం.

ఇలా ఉండగా ప్రశాంత్ నీల్ కుటుంబాన్ని ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతి (Pranathi)తో వెళ్లి కలిశారు. అయితే ఉన్నట్టుండి ఎన్టీఆర్ ఎందుకు ఇలా వారిని కలవాల్సి వచ్చింది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయంలోకి వెళితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కాంబినేషన్లో సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రశాంత్ నీల్, సలార్ , కే జి ఎఫ్ 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ప్రాజెక్టులన్నీ అయిపోయిన తర్వాతనే వీరిద్దరి కాంబినేషన్ సెట్స్పైకి వెళ్లనుంది.

ఇకపోతే ఎన్టీఆర్ తను పనిచేసే దర్శకులతో సన్నిహితంగా ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇటీవల ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు. కాబట్టి తరచుగా ఆయనను కలుస్తూ ఉన్నాడు. ఇక పోతే ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ని కలవడానికి కూడా ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ ఉంది . ఇకపోతే మే 5వ తేదీన అంటే నిన్న ఎన్టీఆర్ ప్రణతి లు తమ పదకొండవ వెడ్డింగ్ యానీవర్సరీ డే ను సెలబ్రేట్ చేసుకోగా ప్రశాంత్ నీల్ పెళ్లి రోజు కూడా అదే రోజు కావడంతో ఈ రెండు జంటలు కలిసి ఈ ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకోవడం గమనార్హం.

Scroll to Top