సింహాలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి..?

BY T20,

పైన మాట వినగానే ఆశ్చర్యపోయారా? అయితే, సింహాలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం..

సింహం... అడవికి ఇదే రారాజు.. ఇది వస్తోందంటే జంతువులన్నీ గజగజలాడుతాయి. ఇది ఒక్కసారి గర్జిస్తే చాలు అడవంతా కూడా వణుకుతుంది.. అయితే, ఇదంతా కూడా సింహం వయసులో ఉన్నప్పుడు మాత్రమే. కానీ, సింహం వయసు పెరుగుతున్నా కొద్దీ ఆ లెక్క మారిపోతది. సింహం ముసలిది అయ్యిందనుకో దానికి ఏ జంతువు కూడా భయపడదు. అది ముసలిదైతే దానిని దాని వెంట ఉండే సింహాల గుంపే తరిమేస్తాయి. రారాజుగా జీవితం గడిపిన సింహం ఆత్మహత్య చేసుకుంటది. అయితే, సింహాలు గుంపులుగుంపుగానే తిరుగుతూ అవి ఎక్కడికి వెళ్లినా కలిసిమెలిసే వెళ్తుంటాయి. ఈ సింహాల గ్రూపులో దాదాపు 15 సింహాలు ఉంటాయి. ఒక్కో గ్రూపులో 4 లేదా 5 మగ సింహాలు మాత్రమే ఉంటాయి. గ్రూపులో ఉన్న సింహాలన్నీ ఎంతో అన్యోన్యతతో కలిసిమెలిసి ఉంటాయి. అయితే, ఈ సింహాల గ్రూపులో వేటాడే బాధ్యత మాత్రం ఆడ సింహాలదే.

అయితే, సింహం పిల్లలు పుట్టినప్పుడు వాటి కళ్లు రెండు వారాల తర్వాతనే తెరుచుకుంటాయి.. అప్పటివరకు తెరుచుకోవు. ఆ 2 వారాల వరకు తల్లి సింహం తన పిల్లల వెంటే ఉంటుంది. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటూ అవి ఉండే ప్లేస్ నుంచి అస్సలు కదలదు. ఈ సమయంలో గ్రూపులో ఉండే మిగతా సింహాలు కూడా ఈ ఆడ సింహానికి హెల్ప్ చేస్తాయి. రెండు వారాల తర్వాత పిల్లలు కళ్లు తెరుచుకోగానే తల్లి సింహం వాటికి నడవడం నేర్పిస్తుంది. అప్పటి నుంచి ఆ పిల్ల సింహాలు తల్లితో కలిసి మందతో వెళ్తాయి. అవి ఎటు వెళ్తే అటు వెళ్తాయి. సింహాల గుంపు ఏ ప్లేస్ కు వెళ్తే అవి వాటి వెనుకే తిరుగుతాయి. ఇలా తిరుగుతూ తిరుగుతూ తన తల్లిని చూసి కేవలం 3 నెలల్లోనే ఆ పిల్ల సింహాలు కూడా వేటాడం నేర్చుకుంటాయి. ఈ పిల్ల సింహాలు వేటాడం నేర్చుకున్న తర్వాత మందలో ఉన్న ఆడ సింహాలకు అవి హెల్ప్ చేస్తాయి.

ఈ క్రమంలో ఆ గ్రూపులో ఏదైనా సింహం కొంచెం ముసలిదైందంటే చాలు ఆ సింహాలన్నీ కలిసి దానిని ఆ గ్రూపు నుంచి వెళ్లగొడుతాయి. ఎందుకంటే సింహం ముసలిదైతే వేటడలేదు.. తమ మందను రక్షించలేదు కాబట్టి. అప్పటివరకు గ్రూపులో ఉన్న ముసలి సింహం గ్రూపు నుంచి వెలివేయబడ్డ తర్వాత ఏం చేస్తుందంటే.. తన ఆహారాన్ని తానే సంపాదించుకోవాలి. కానీ, అది ముసలిది కావడంతో అది పాజిబుల్ కాదు. ఎందుకంటే ఇతర జీవులను వేటాడే శక్తి దానికి ఉండదు. ఇలాంటి సిచుయేషన్ లో ఆ ముసలి సింహం ఒంటరిగా అలాగే పస్తులుంటుంది. ఏదైనా యాక్సిడెంట్ లో కానీ, ఎక్కడైనా గానీ చనిపోయిన జంతువు కనిపిస్తే తింటుంది. అంతేకానీ, రోజూ అలాంటి అదృష్టం ఉండదు. కొన్నిసార్లు అయితే ఆకలితో 15 రోజుల వరకు అలాగే ఉంటుంది. ఈ కారణంగా దాని పరిస్థితి మరీ అధ్వానంగా, దయనీయంగా మారిపోతుంది. దీంతో అది నడవలేవు...పరిగెత్తలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలికి తట్టుకోలేక దాని ప్రాణాలు అదే తీసుకుంటుందంట.

Scroll to Top