Osama Bin Laden: బాబోయ్ ‘బిన్ లాడెన్’ ఇంత పెద్ద స్కెచ్ వేశాడా?.. వెల్లడైన షాకింగ్ రహస్యాలు!

BY T20,

తాలిబన్ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ సెప్టెంబర్ 11, 2001న అమెరికా న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 3,000 మందికిపైగా జనాలు ప్రాణాలు కోల్పోయారు. 9/11 ఘటనగా పిలువబడే ఈ దాడులు అమెరికాను అతలాకుతలం చేశాయి. ఈ దాడులపై ప్రతీకారంతో రగిలిపోయిన అమెరికా.. చివరకు ఒసామా బిన్ లాడెన్‌ను దొరకబట్టుకుని మరీ అంతమొందించారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అమెరికన్ నేవీ సీల్స్.. బిన్ లాడెన్‌ ఉన్న చోటకు వెళ్లి మరీ దాడి చేసి చంపేశారు.

అయితే, 2011లో బిన్ లాడెన్ హత్య తరువాత యూఎస్ నేవీ సీల్స్ పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ పత్రాల్లో కీలక అంశాలను వెల్లడయ్యాయి. ఆల్ ఖైదా నాయకుడైన బిన్ లాడెన్.. ప్రయాణికుల విమానాలకంటే ప్రైవేట్ జెట్‌లను దాడుల కోసం ఉపయోగించడం ఉత్తమం అని భావించి.. ఆ దిశగా ప్లాన్ వేశాడని అందులో తేల్చారు. అయితే, తాజాగా మరో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఇస్లామిక్ పండితులు, రచయిత ఎంఎస్ లాహౌద్ తన జీవితంలో ఎక్కువ భాగం ఆల్ ఖైదా పైనే పరిశోధనలు జరిపారు. ఒసామా బిన్ లాడెన్ వ్యక్తిగత లేఖలు, నోట్స్ తదితర వాటిని పరిశీలించారు. దీనికి సంబంధించి ఓ అంతర్జాతీయ మీడియాకు లాహౌద్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించారు.

9/11 దాడుల తరువాత అమెరికాపై మరో భారీ దాడికి బిన్ లాడెన్ ప్లాన్ వేశారని లాహౌద్ వెల్లడించారు. 9/11 దాడి తరువాత అమెరికన్లు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తారని, ముస్లిం మెజారిటీ రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్లు వస్తాయని భావించాడట. అయితే, దాడి తరువాత అమెరికన్ల నుంచి వచ్చిన స్పందనను చూసి బిన్ లాడెన్ ఆశ్చర్యపోయాడట. ఆయన రాసిన లేఖల్లో ఈ విషయం స్పష్టంగా ఉందని లాహౌద్ తెలిపారు. మరో విషయం ఏంటంటే.. 9/11 దాడుల తరువాత అమెరియా యుద్ధం చేస్తుందని ఆల్ ఖైదా ఊహించలేదట.

ఇదిలాఉంటే.. లభించిన లేఖల ప్రకారం ఒసామా బిన్ లాడెన్ అమెరికాపై దాడి తరువాత దాదాపు మూడేళ్ల పాటు ఆల్ ఖైదా టీమ్‌తో కమ్యూనికేట్ అవలేదట. కానీ, 2004లో తిరిగి తన గ్రూప్‌తో ములాఖత్ అయ్యాడు బిన్ లాడెన్. మరోసారి అమెరికాపై దాడి చేయడానికి కొత్త ప్రణాళికలు కూడా రచించాడు. అయితే, గతంలో మాదిరిగా విమానాల ద్వారా దాడి సాధ్యం కాదని, విమానాశ్రయాలలో భద్రత పటిష్టంగా ఉండటాన్ని గుర్తించాడు లాడెన్. దాంతో యూఎస్‌పై తదుపరి దాడి కోసం ప్యాసింజర్ విమానానికి బదులుగా, చార్టర్ విమానాన్ని ఆపరేట్ చేయాలని ప్లాన్ వేశాడు. విమానం ఉపయోగించి దాడి చేయడం కష్టమైతే.. యూఎస్ రైల్వేలను లక్ష్యంగా చేసుకోవాలని దిశానిర్దేశం చేశాట.

సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన లాడెన్ అమెరికాపై ఎలా దాడి చేయాలో సరిగ్గా వివరించాడని లాహౌద్ చెప్పారు. ‘‘12 మీటర్ల మేర రైలు పట్టాలను తొలగించాలి. తద్వారా రైలు పట్టాలు తప్పుతుంది. అలా దాడి చేయొచ్చు.’’ అని లాడెన్ తన గ్యాంగ్‌కు ప్లాన్ వివరించాడని లాహౌద్ తెలిపారు. అయితే, అదృష్టం కొద్ది బిన్ లాడెన్ తన ప్రణాళికలను ఎప్పటికీ అమలు చేయలేకపోయాడు. అంతేకాదు.. లాడెన్ దాడి చేసే అవకాశం ఉందని యూస్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారని లాహౌద్ తెలిపారు.

9/11 వెనుక ఉన్న సూత్రధారిగా ఉన్న లాడెన్.. 2010లో ముడి చమురు ట్యాంకర్లు, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని ప్రధాన షిప్పింగ్ మార్గాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు లేఖలు వెల్లడించాయి. అల్-ఖైదా కార్యకర్తలు మత్స్యకారులుగా నటిస్తూ ఓడరేవు ప్రాంతాల్లో తమను తాము కలుపుకోవచ్చని బిన్ లాడెన్ సూచించినట్లు ఎంఎస్ లాహౌద్ పేర్కొన్నారు. రాడార్ నుండి తప్పించుకోవడానికి నిర్దిష్ట పడవలను ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా తన బృందానికి సూచించాడు లాడెన్. పేలుడు పదార్థాలను రవాణా చేయడానికి నౌకలను ఎలా ఉపయోగించాలో కూడా వివరించాడు. బిన్ లాడెన్ నిజంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలనుకున్నాడు అని ఎంఎస్ లాహౌద్ పేర్కొన్నారు.

Scroll to Top